శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు రూపొందింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో మహర్షి లాంటి భారీ సక్సెస్ తర్వాత రాబోతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలో మహేష్‌బాబు సరసన అందాలభామ రష్మీక మందన్న నటిస్తుంది. వీరితో పాటుగా లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత, బండ్ల గణేష్ తదితరులు నటిస్తున్నారు.
సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమా జనవరి 11న విడుదలకు సన్నహాలు చేస్తున్నారు. అయితే సరిలేరు నీకెవ్వరూ చిత్ర ప్రమోషన్‌ను ప్రిన్స్ మహేష్‌బాబు తనదైన పద్దతిలో ముందుకు సాగిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఓ వరుస క్రమంలో అభిమానులకు ప్రెష్ ప్రెష్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన ప్రమోషన్లలో భాగంగా అత్యంత కీలకమైన ప్రమోషన్ కార్యక్రమం సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక. అయితే ఈ వేడుకతో ప్రిన్స్ అభిమానులకు తీపి కబురే అందించారు మహేష్‌బాబు. ఈ వేడుకును ఎప్పుడు ఎక్కడ నిర్వహించాలో చిత్ర యూనిట్ ఇప్పటికే అఫీషియల్‌గా ప్రకటించింది.
అయితే ఈ ఫ్రీ రిలీజ్ వేడుకను ఓ పెద్ద పండుగగా చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందని టాక్. ప్రిన్స్ అభిమానులు ఈ ఈవెంట్‌తో పిచ్చెక్కిపోయేలా.. ఇతర సినిమాకు ధీటుగా ఈ వేడుకు ను నిర్వహిస్తే.. అంబరాన్ని అంటేలా సంబరాలు చేయాలని భావిస్తుందని టాక్. అసలే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎల్ బీ స్టేడియంలో ఈ వేడుకును జనవరి 5న సాయంత్రం 5.04 గంటలకు జరుపనున్నారు. ఇప్పటికే మహేష్‌బాబు స్టామినాకు తగినట్లుగా బిజినెస్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకతో చిత్రాన్ని భారీ బ్లాక్‌బ్లస్టర్ దిశగా తీసుకుపోవాలనే ఎత్తు వేస్తున్నారు.