రాష్ట్రంలో నిత్యం సంచలనాలకు వేదిక అయిన రాజధాని అమరావతి విషయంలో మరో సంచలనం తెరమీ దికి వచ్చింది. గత ప్రభుత్వం దీనిని ప్రపంచ రాజధాని అని ప్రజలకు దేశానికి, ప్రపంచానికి పరిచయం చే యడం, ఇప్పుడు అధికారం చేపట్టిన వైసీపీ మాత్రం.. రాజధానిపై తనదైన శైలిలో వ్యవహరిస్తుండడంతో పరిస్థితి ఏంటనేది సాధారణ ప్రజలకు కూడా అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన చట్టంలో రాజ ధాని లేని ఏపీకి పదేళ్లపాటు హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈలోగా ఏపీకి కొత్తరాజధానిని నిర్మించుకోవాలి. ఈ నేపథ్యంలోనే కారణాలు ఏవైనా..గత సీఎం చంద్రబాబు.. హుటాహుటిన ఏపీలో అమరావతికి అడుగులు వేశారు. ఏకంగా ప్రధాని మోడీతోనే దీనికి శంకుస్థాపన చేయిం చారు. సింగపూర్, జపాన్, దుబాయ్ వంటి దేశాల సహకారంతో మాస్టర్ ప్లాన్లు రూపొందించారు. ప్రపంచ రాజ ధానిగా నవ నగరాల సుందర రాజధానిగా దీనిని మలచాలని ఆయన కలలు గన్నారు. అయితే, ఈ క్రమంలో నే బాబు మదిలో రాజకీయ పోకడ పొటమరించింది. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు రాజధానిని ఆయ న హేతువు చేసుకున్నారు.
ఈ నేపథ్యమే రాజధానిని ముందుకు తీసుకు వెళ్లలేక పోయింది. అన్నీతాత్కాలిక కట్టడాలకే పరిమితమ య్యేలా చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ రాజధానిని నిర్మిస్తే.. ఆ పేరు శాశ్వతంగా బాబుకే ఉం డిపోతుందని తలపోస్తున్న మాట యథార్థం. ఈ నేపథ్యంలో ఆయన రాజధానిని కుదించి, కొన్ని ని ర్మాణాలకే పరిమితం చేసి, ఇతర జిల్లాలకు మరికొన్నింటిని తరలించే తన సొంత మేనిఫెస్టోకు ఆయన రూపకల్పన చేసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే జీఎన్ రావు కమిటీని వేశారు.
ఇది రాష్ట్రం మొత్తం పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే, తాజాగా మరో కమిటీని వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలోనే మంచి ఐఐటీగా పేరున్న రూర్కెలా(ఒరిస్సా) ఐఐటీ అధ్యాపకులు పరిశోధకులతో కూడిన కమిటీని వేయనున్నారు. అమరావతి నిర్మాణాలను ఎంత వరకు కుదించవచ్చు అనేది పరిశీలన చేస్తుందట. ఇప్పటి వరకు అమరావతిలో చేపట్టిన పనులను పరిశీలించి ఎంత వరకు పురోగతి ఉందో, ఏ మేరకు కుదించవచ్చో, ప్లాన్‌లో ఏ మేరకు మార్పులు చేయవచ్చో ఈ నిపుణులు తేల్చుతారట.
సుమారు నెల, నెలన్నర రోజుల్లో దీనిపై నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. మొత్తంగా చూస్తే.. రాజధాని నిర్మాణాలు ఇప్పట్లో సాగేలా కనిపించడం లేదనేది వాస్తవం అంటున్నారు మేధావులు. మరి ఎన్నికల నాటికైనా జగన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తారో లేదో చూడాలి.