అధికారుల‌తో జ‌గ‌న్ రాజ‌కీయాలా? ఏం జ‌రుగుతోంది?

ఏపీ సీఎం జ‌గ‌న్ రాజ‌కీయ ప‌రిధుల‌ను దాటుతున్నారా?  పార్టీల వ‌ర‌కే ఉండాల్సిన రాజ‌కీయాల‌ను అధికారు ల వ‌ర‌కు, ముఖ్య‌మంత్రి కార్యాల‌యం వ‌ర‌కు కూడా తీసుకు వెళ్తున్నారా? గ‌త కొన్నాళ్లుగా ఇదే చ‌ర్చ , ఆరోప ణ‌లు జ‌రుగుతున్నాయి. అధికార ప‌క్షాన్ని విప‌క్షం ఇదే రీతిలో టార్గెట్ చేస్తోంది. అయితే, గ‌తంలో తాము కూ డా ఇలానే వ్య‌వ‌హ‌రించి రాజ‌కీయంగా అభాసుపాలు కావ‌డంతో ఇప్పుడు టీడీపీ కొంత మెత్త‌బ‌డినా.. మేధావి వ‌ర్గాల్లో మాత్రం ఈ త‌ర‌హా చ‌ర్చ మాత్రం సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. గ‌డిచిన ఆరు మాసాల పాల‌న‌లో సీఎం జ‌గ‌న్‌కు ఈ త‌ర‌హా ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చిందో చూద్దాం.,

అధికారుల బ‌దిలీ, నియామాలు అనే విష‌యంలో ప్ర‌భుత్వానికి ఫుల్లుగా స్వేచ్ఛ ఉంటుంది. ఇది రాష్ట్ర ప్ర భుత్వ అధికారాల జాబితాలో ఉండ‌డంతో రాజ్యాంగం నుంచి కూడా రాష్ట్రాలు పూర్తిగా స్వేచ్ఛ ల‌భించిం ది. అంటే, అధికారుల బ‌దిలీ, కొత్త‌వారికి పోస్టింగ్ విష‌యాల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే, జ గ‌న్ ప్ర‌బుత్వ విష‌యంలో గ‌డిచిన నాలుగు మాసాలు విప‌రీత‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా  మాజీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం, ప్ర‌స్తుతం తెలంగాణ కేడ‌ర్‌లో ఉన్న ఐఏఎస్ శ్రీ ల‌క్ష్మి, ఐపీఎస్ స్వీఫెన్ స‌న్‌, ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌ ముఖేష్ కుమార్ సిన్హా, నీలం సాహ్నిల విష‌యంలో జ‌గ‌న్ విమ‌ర్శ‌ల‌కు తావిచ్చేలా వ్య‌వ‌హ‌రించార‌నేది వాస్తవం.

నిజానికి ఏ ప్ర‌భుత్వానికైనా కూడా ఐఏఎస్‌లు కీల‌క అధికారులు కాబ‌ట్టి.. వారిని నియ‌మించుకోవ‌డం అనే ది సీఎంకు ఉన్న స్వేచ్ఛ‌. అయితే, ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంను తొల‌గించిన తీరు.. జ‌గ‌న్‌కు మాయ‌ని మ‌చ్చ లా మిగిలింద‌నే వాద‌న ఉంది. తాను ఏరికోరి తెచ్చుకున్న ప్ర‌వీణ్ ప్ర‌కాశ్‌ను సంజాయిషీ కోరడ‌మే ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం. అయితే, సంజాయిజీ కోర‌డానికి త‌గిన కార‌ణాలు క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయి నా కూడా ఎల్వీని హ‌ఠాత్తుగా బ‌దిలీ చేయ‌డం మాత్రం తీవ్ర ఆరోప‌ణ‌లకు అవ‌కాశం ఇచ్చింది.

అదే స‌మయంలో తెలంగాణ కేడ‌ర్‌లోని శ్రీల‌క్ష్మిని త‌న ప్ర‌భుత్వంలోకి తెచ్చుకునేందుకు ఇప్ప‌టికీ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో ఈ ప‌రిణామాలు రాజ‌కీయంగా విమ‌ర్శ‌ల‌కు తావిస్తున్నాయి. దీనిలో జ‌గ‌న్ స్వార్థం ఉంద‌ని ఎవ‌రూ చెప్ప‌లేక పోయినా.. త‌న అనుకున్న వారి కోసం ఇంత‌గా ఎందుకు ప్ర‌య‌త్నిస్తార‌నేదే ప్ర‌ధాన ప్ర‌శ్న‌.
Tags: AP, Government Employes, YS Jagan, ysrcp