ఈ యేడాది ‘ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు ఈ సినిమాతో ఆకట్టుకోలేకపోయిన బాలయ్య.. రూలర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అయితే ఈ సినిమా కూడా నెగటీవ్ టాక్‌తో ప్రేక్షకులను చేరుకోలేకపోయింది. ఈ సినిమా విడుదలకు ముందు బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌లో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పండగే.
ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు బాలయ్య. ఆయన హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా జనవరి 3న నుండి మొదలు కానుంది. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘లెజెండ్’ మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను మెయిన్ విలన్ గా తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
అలాగే హీరో శ్రీకాంత్ మరో నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. శ్రీకాంత్ హీరోగా కొనసాగుతూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో యుద్ధం శరణం సినిమాలో నెగెటివ్ రోల్‌లో నటించిన శ్రీకాంత్, ఓ మలయాళ చిత్రంలోనూ ప్రతినాయక పాత్రలో మెప్పించాడు. మరియు ఈ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ కూడా ఉండబోతుందట. ఆ పాత్రకు కేథరీన్ థెరీసాని తీసుకోనున్నారట. మరో అతిధి పాత్రలో హీరోయిన్ వేదిక కూడా కనిపించనుంది. ఏదేమైనా ఈ సినిమా హిట్ కొడితే మాత్రం.. వీళ్ళు హ్యాట్రిక్ విజయాలు అందుకున్నట్టు అవుతుంది.