మహేష్ – త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఫిక్స్… మ‌ళ్లీ అదే సెంటిమెంట్‌…!

సూపర్ స్టార్ కృష్ణ న‌టవార‌సుడి గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ ఇప్పటికి చాలామంది అమ్మాయిలకు రాజకుమారుడిగా మదిలో ఉండిపోయాడు. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ సినిమాలు అంతగా సక్సెస్ కాకపోయినా మహేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. మహేష్ బాబు తను నటించిన నిజం సినిమా ద్వారా మొదటిసారిగా నంది అవార్డును సాధించాడు.

SSMB 28 (2024) - IMDb

ఆ తర్వాత ఎన్నో సినిమాలలో మహేష్ బాబుకు నంది అవార్డు పురస్కారం దక్కింది. ఆయన చేసిన సినిమాల్లో చాలా వరకు హిట్స్ గానే నిలిచాయి. మహేష్ బాబు ఇటీవల పూజా హెగ్డే హీరోయిన్ గా, శ్రీ లీల కీలక పాత్రలో నటిస్తున్న SSMB28 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వంలో వ‌స్తోన‌న్న ఈ సినిమాకు SSMB28 అనే ర‌న్నింగ్ టైటిల్ ఖ‌రారు చేశారు.

లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం త్రివిక్ర‌మ్ ఈ సినిమాకు ఒక టైటిల్ ఫిక్స్ చేశాడని.. అది మహేష్ బాబుకు కూడా నచ్చడంతో ఆ టైటిల్ ఫైన‌లైజ్‌ చేశారని అంటున్నారు. ఇంతకీ ఆ టైటిల్ ఏంటా అనుకుంటున్నారా త్రివిక్రమ్ కు అ అనే అక్షరంతో టైటిల్ ఉండాలి అనే సెంటిమెంట్ ఉంది. దాంతో ఈ సినిమాకి అమరావతికి అటు ఇటు అనే టైటిల్ త్రివిక్రమ్ అనుకున్నాడ‌ట‌.

Trivikram Srinivas' team clarifies he's not on social media after this post  went viral | Telugu Movie News - Times of India

త్రివిక్ర‌మ్ సినిమాల టైటిల్స్ అన్నీ అతో స్టార్ట్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆ సెంటిమెంట్ ఫాలో అవుతూ పెట్టిన ఈ టైటిల్ మహేష్ బాబుకు చెప్పగా మహేష్ కి కూడా ఈ టైటిల్ నచ్చ‌డంతో దీనినినే మ‌హేష్‌ 28వ‌ సినిమాకు ఖరారు చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని త్వ‌ర‌లోనే క‌న్‌ఫార్మ్ చేస్తూ టైటిల్ పోస్ట‌ర్ వేయ‌నున్నారు.