‘ క‌స్ట‌డీ ‘ రివ్యూ…. నాగ‌చైత‌న్య అక్కినేని ఫ్యామిలీ ప్లాప్స్‌కు బ్రేక్ వేశాడా…!

అక్కినేని నాచైత‌న్య తాజాగా న‌టించిన సినిమా క‌స్ట‌డీ. కోలీవుడ్ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌. అక్కినేని హీరోలు గ‌త కొద్ది రోజులుగా న‌టిస్తోన్న అన్నీ సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. దీంతో క‌స్ట‌డీతో నాగ‌చైత‌న్య హిట్ కొట్ట‌డంతో పాటు అక్కినేని హీరోల వ‌రుస ప‌రాజ‌యాల‌కు బ్రేకులు వేస్తాడ‌న్న ఆశ‌ల‌తో అక్కినేని అభిమానులు, తెలుగు సినీ ప్రేక్ష‌కులు ఉన్నారు.

Custody Review: A Racy Screenplay With Unique Storyline - News Bugz

ఇక ఈ రోజు రిలీజ్ అయిన క‌స్ట‌డీ సినిమా ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వ‌స్తోంది. ఓవ‌రాల్‌గా సినిమాలో నాగ‌చైత‌న్య‌, అర‌వింద‌స్వామి న‌ట‌న‌లో ఇర‌గ‌దీశార‌ని చెపుతున్నా.. అయితే క‌థ‌, క‌థ‌నం విష‌యంలో మాత్రం తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇళ‌య‌రాజా, యువ‌న్ శంక‌ర్ రాజా నేప‌థ్య సంగీతం బాగున్నా పాట‌లు ఆక‌ట్టుకునేలా లేవ‌ని చెపుతున్నారు.

Custody(2023) Telugu Movie -Cast, Release Date, Review, Story -  NewsFeast.in : Today News In English, India News Today, Top Stories

సినిమా చాలా స్లోగా మొద‌లై.. ప్రిడిక్షిన‌బుల్ నెరేష‌న్‌తో కొన‌సాగుతూ ఇంట‌ర్వెల్ వ‌ర‌కు ప‌ర‌మ రొటీన్ సీన్ల‌తోనే న‌డుస్తుంద‌ట‌. ఇక ఇంట‌ర్వెల్ బ్యాంగ్ ప‌ర్వాలేదంటున్నారు. ఓవ‌రాల్‌గా సినిమా యావ‌రేజ్ లేదా బిలో యావ‌రేజ్ సినిమాగా మాత్ర‌మే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిలిచే ఛాన్సులు ఉన్నాయ‌నే ఎక్కువ మంది చెపుతున్నారు. ఇక చాలా సీన్లు గ‌త సినిమాల్లో చూసేసిన‌ట్టే ఉన్నాయ‌ని చెపుతున్నారు.

Indian Clicks on Twitter: "#Custody Releasing Worldwide Tomorrow 💥❤️ A  Massive Theatrical Experience Awaits You!🔥 🎟️https://t.co/jog4CWjze9  #CustodyFromTomorrow @chay_akkineni @vp_offl @realsarathkumar  @thearvindswami @ilaiyaraaja @thisisysr ...

ఓ సిన్సియ‌ర్ పోలీస్ కానిస్టేబుల్ కు త‌న ఉద్యోగ నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యాయి.. అత‌డు త‌న ప్రేమ‌ను సాకారం చేసుకునేందుకు ఏం చేశాడు ? అన్న‌దే సినిమా మెయిన్ లైన్‌. దీనిని ఆస‌క్తిగా ప్ర‌జెంట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ్డాడ‌నే చాలా మంది చెపుతున్నారు.

Custody: Will it be a nightmare for Akkineni fans again ..? - Filmify.in

ఇక ఫైన‌ల్‌గా క‌స్ట‌డీ 1990ల నాటి క‌థ‌తో న‌డుస్తుంద‌ని… ఏదేమైనా చైతు మ‌రో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడ‌ని… ఫ‌స్టాఫ్‌లో కేవ‌లం 15 నిమిషాలు మాత్ర‌మే క‌థ ఉంటుంద‌ని.. అన‌వ‌స‌ర‌మైన సాంగ్స్ ఫ‌స్టాఫ్‌ను డ‌ల్ చేస్తే.. సెకండాఫ్ మంచిగా స్టార్ట్ అయినా అది కూడా క్ర‌మ‌క్ర‌మంగా గ్రాఫ్ డౌన్ అవుతూ వ‌చ్చింద‌ని చెపుతున్నారు. ఏదేమైనా క‌స్ట‌డీకి హిట్ రివ్యూలు అయితే రావ‌ట్లేదు.