‘ క‌స్ట‌డీ ‘ ప్ల‌స్‌లు (+)… మైన‌స్‌లు (-)… చైతు, కృతి ప్లాప్‌ల ద‌రిద్రం వ‌దిలిందా…!

నాగ‌చైత‌న్య , కృతిశెట్టి జంట‌గా వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా క‌స్ట‌డీ. నాగ‌చైత‌న్య కాప్‌గా న‌టించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో అంచ‌నాలు తెచ్చుకుంది. చైతు, కృతి శెట్టి గ‌త సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. వీరిద్ద‌రి కెరీర్ అంతంత మాత్రంగానే ఉన్న నేప‌థ్యంలో ఈ సినిమాతో హిట్ కొట్టి ఇద్ద‌రూ స‌క్సెస్ ట్రాక్ ఎక్కాల‌ని ఆశ‌ల‌తో ఉన్నారు. ఇక ఈ రోజు రిలీజ్ అయిన క‌స్ట‌డీకి మిక్స్ డ్ టాక్ వ‌స్తోంది.

Naga Chaitanya and Krithi Shetty's 'Custody' trailer out - Telangana Today

ఓవ‌ర్సీస్ ప్రీమియ‌ర్ షోల త‌ర్వాత అబ్బా, ఆహో, ఓహో అనే టాక్ అయితే లేదు. ఇక సినిమా ప్ల‌స్‌ల విష‌యానికి వ‌స్తే నాగ‌చైత‌న్య‌, అర‌వింద్ స్వామి న‌ట‌న అదిరిపోయింద‌నే చెపుతున్నారు. ఇక సినిమాలో యాక్ష‌న్ ఎపిసోడ్స్ చూస్తుంటే గూస్‌బంప్స్ మోత మోగిపోతోంద‌ట‌. ఈ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌కు యువ‌న్ శంక‌ర్ రాజా, ఇళ‌య‌రాజా అందించిన నేప‌థ్య సంగీతం కూడా చాలా బాగుంద‌నే అంటున్నారు.

ఇక సినిమాటోగ్ర‌ఫీ కూడా బ్యూటిఫుల్‌గా ఉంద‌ట‌. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌తో పాటు సెకండాఫ్‌లో వ‌చ్చే సీన్లు సినిమాకు ఆయువుప‌ట్టుగా ఉన్నాయంటున్నారు. ఇక మైన‌స్‌ల విష‌యానికి వ‌స్తే సినిమాలో హీరో, హీరోయిన్ల ప్రేమ‌క‌థ ఏ మాత్రం ఆస‌క్తిగా లేదు. గ‌తంలో చాలా సినిమాల‌లో చూసిన సీన్లే ఈ సినిమాలోనూ ఉన్నాయంటున్నారు.

Krithi Shetty As Brave Revathi From Custody

ఇక సినిమాకు మెయిన్ మైన‌స్‌గా పాట‌లు ఉన్నాయ‌ట‌. ఇక కొన్ని డ్రాగ్‌డ్ సీన్లు కూడా బోరింగ్‌గా మారి సినిమా స్థాయిని పూర్తిగా త‌గ్గించేశాయి. ఇక ఫ‌స్టాఫ్‌లో అస్స‌లు క‌థ లేద‌ని.. సెకండాఫ్ బాగుంది అనే టైంలోనే ద‌బాలున డౌన్ చేసేశాడ‌ని.. ఓవ‌రాల్‌గా యావ‌రేజ్ కు కాస్త అటూ ఇటూగా క‌స్ట‌డీ రేంజ్ నిలిచిపోయింద‌నే ఎక్కువ మంది చెపుతున్నారు. ఏదేమైనా క‌స్ట‌డీతో చైతుకు హిట్టో సూప‌ర్ హిట్టో అయితే వ‌చ్చేలా లేదు.