అక్కినేని నట వారసుడు కింగ్ నాగార్జున బర్త్ డే ఈరోజు. నాగర్జున 63వ వసంతం లోకి అడుగుతు పెట్టిన సందర్భంగా చాలామంది సెలబ్రిటీలు నాగ్ కి బర్త్ డే విషెష్ అందించారు. వీరితో పాటే సూపర్ స్టార్ మహేష్ (Mahesh) కూడా నాగార్జునకి బర్త్ డే విషెష్ ట్విట్టర్ వేదికగా చెప్పారు. అయితే ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మహేష్ నాగార్జునని సర్ అని కానీ గారు అని కానీ సంభోదించలేదు. కేవలం నాగార్జున అని మాత్రమే పెట్టారు.
ఇండస్ట్రీలో తనకన్నా సీనియర్ హీరో.. స్టార్ డం కలిగిన నటుడు.. కనీసం Mahesh నాగార్జున వయసుకైనా సరే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని అక్కినేని ఫ్యాన్స్ గరం గరం మీద ఉన్నారు. అంతేకాదు మహేష్ ట్వీట్ ని ట్యాగ్ చేస్తూ చాలా మంది అక్కినేని ఫ్యాన్స్ రిప్లైస్ కూడా ఇస్తున్నారు. మరి మహేష్ ఇలా కావాలనే చేశాడా లేక తెలియకుండా జరిగిందా.
అక్కినేని ఫ్యాన్స్ చేస్తున్న ఈ హంగామాకి మహేష్ రెస్పాండ్ అవుతాడా.. మహేష్ కి నిజంగానే నాగార్జున అంటే రెస్పెక్ట్ లేదా కనీసం బర్త్ డే విషెష్ చెప్పకపోయినా బాగుండేది కానీ ఇలా రెస్పెక్ట్ లేకుండా చెప్పి ఎందుకని సోషల్ మీడియాలో రగడ మొదలైంది.
Happy birthday @iamnagarjuna!! Wishing you happiness and abundance always!
— Mahesh Babu (@urstrulyMahesh) August 29, 2022