Mahesh : లేడీ ఫ్యాన్స్ కి మెంటలెక్కించే మహేష్..!

టాలీవుడ్ హీరోల్లో మహేష్ స్టైల్ వేరు. ఆయన తన బాడీ చూపించడానికి అసలు ఇష్టపడరు. మిగతా హీరోలు సిక్స్ ప్యాక్ లు గట్రా చేసి టాప్ లెస్ షోలు చేసినా మహేష్ (Mahesh) మాత్రం షర్ట్ విప్పిన సందర్భాలు కూడా చాలా తక్కువ. అయితే అలాంటి మహేష్ ఏకంగా టాప్ లెస్ గా అదే తన కండలు తిరిగిన దేహాన్ని చూపించేశాడు.

సినిమాలు లేని టైం లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే మహేష్ త్రివిక్రం సినిమా స్టార్ట్ అవ్వకముందే ఫ్యామిలీతో జాలీ ట్రిప్ వేశాడు. ఈ టైం లో మహేష్ అక్కడ బాగా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక స్విమ్మింగ్ పూల్ లో మహేష్ షర్ట్ లెస్ ఫోజోలతో అమ్మాయిలకు షాక్ ఇచ్చాడు. మహేష్ లేడీ ఫ్యాన్స్ సూపర్ స్టార్ ని ఇలా చూసి మెంటలెక్కిపోవడం ఖాయమని చెప్పొచ్చు.

త్రివిక్రం సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుండగా Mahesh ఆ సినిమాలో స్టైలిష్ లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించబోతున్నారు. ఈ సినిమాని 2023 ఏప్రిల్ 28 రిలీజ్ అని కూడా ప్రకటించారు.

Tags: mahesh, Pooja Hegde, Superstar Mahesh, Tollywood, trivikram