Liger : బాయ్ కాట్ లైగర్.. రౌడీ హీరోకి తగలనున్న గట్టి దెబ్బ..!

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా లైగర్ (Liger). ఈ సినిమాను తెలుగుతో పాటుగా హిందీలో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఆగష్టు 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా విషయంలో బాలీవుడ్ ఆడియెన్స్ షాక్ ఇచ్చేలా ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ఆడియెన్స్ అంతా అక్కడ సినిమాలన్ని బాయ్ కాట్ చేస్తున్నారు. ఈమధ్యనే వచ్చిన లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ సినిమాలు బాయ్ కాట్ చేశారు.

అంతేకాదు ఈ వారం రిలీజ్ అయిన దొబారా సినిమాలు కూడా బాయ్ కాట్ బారిన పడ్డాయి. ఇక ఇప్పుడు ఆ ఎఫెక్ట్ లైగర్ (Liger) మీద కూడా పడుతుంది. లైగర్ సినిమా కరణ్ జోహార్ నిర్మించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ లో కరణ్ జోహార్ పాత్ర ఉందని బాలీవుడ్ ఆడియెన్స్ కామెంట్. అందుకే కరణ్ జోహార్ నిర్మించిన లైగర్ సినిమాని కూడా వారు బాయ్ కాట్ చేయాలని చూస్తున్నారు. మరి బాయ్ కాట్ ఎఫెక్ట్ లైగర్ మీద ఏమేరకు పడుతుందో చూడాలి.

ఎన్నో భారీ అంచనాలతో వస్తున్న లైగర్ సినిమా బాయ్ కాట్ చేస్తే మాత్రం హిందీ మార్కెట్ ఇంకాస్త రిస్క్ లో పడే అవకాశం ఉంది. మరి లైగర్ సినిమాకు బాయ్ కాట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags: Bollywood, Boycott, karan johar, liger, Vijay Devarakonda