మహేష్‌కి ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా… ఆమెకు బంప‌ర్ ఆఫ‌ర్‌…!

దివంగత సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడుగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడుగా వరుస‌ సినిమాల్లో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ టాలీవుడ్ సూపర్ స్టార్ గా మహేష్ బాబు కొనసాగుతున్నాడు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన 29వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో భారీ పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు.

ఇదిలా ఉంటే మహేష్ బాబు గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజకీయాలంటే పెద్దగా ఇష్టపడని మహేష్ బాబుకు ఓ స్టార్ పొలిటీషియ‌న్ అంటే చాలా ఇష్టమట.. ఎంతలా అంటే ఏకంగా వాళ్ళ అమ్మ తర్వాత అమ్మలా ఆమెను ఇష్టపడతాడట. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. మహేష్ బాబుకు ఇష్టమైన ఆ పొలిటిషన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

మహేష్ కు ఇష్టమైన ఆ లేడీ పొలిటిషన్ ఎర‌వో కాదు లేడీస్ సూపర్ స్టార్ విజయశాంతి. విజయశాంతి- సూపర్ స్టార్ కృష్ణ జంటగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. విజయశాంతి అంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలుకు పెట్టింది పేరుగానిలిచింది. మహేష్ చిన్నతనంలోనే కృష్ణ- విజయశాంతి కలిసి నటించిన కొడుకు దిద్దిన కాపురం సినిమాలో మహేష్ వారితో కలిసి నటించారు.

Sarileru Neekevvaru Movie Stills | Mahesh Babu | Photo 1 of 3

ఈ సినిమా అప్పట్లోనే ఎంతో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నటిస్తున్న సమయంలోనే మహేష్ బాబుకు విజయ్ శాంతి మీద ఎంతో ఇష్టం ఏర్పడిందట. ఎంతలా అంటే విజయశాంతి మాట్లాడుతుంటే మ‌హేష్‌కు త‌మ కుటుంబ సభ్యులు పలకరించినట్లే ఉండేదట. ఆమెతో మాట్లాడితే ఇంట్లో వాళ్లను పలకరించినట్లే అనిపించేదట. అందుకే షూటింగ్ విరామ సమయంలో మహేశ్ ఆమెతో సరదాగా ముచ్చటించేవారట.. కృష్ణ కూడా వీరి సాన్నిహిత్యాన్ని చూసి ముచ్చటపడేవారు.

ఇప్పుడు మహేశ్ స్టార్ హీరో అయ్యాడు. ఇక మహేష్ బాబు పెద్దయ్యాక కూడా విజయశాంతితో సినిమా చేయాలని చాలా ప్రయత్నించారట. ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమాతో మ‌హేష్ కోరిక‌ నెరవేరింది. అంతే కాదు విజయశాంతితో మరొక సినిమా కూడా చేస్తానని సరరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ మీట్‌లో చెప్పాడు. దీనిని బట్టి చూస్తే మహేష్ బాబుకు విజయశాంతి అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.