“బ్రహ్మముడి ” దుగ్గిరాల ఇంట్లో పెద్ద రచ్చ….. కావ్యపై రెచ్చిపోయిన అపర్ణ….!

బ్ర‌హ్మ‌ముడి ఆగ‌స్టు 9 ఎపిసోడ్‌లో చాలా ట్విస్టులు జ‌రిగాయి. కావ్య వాళ్ళ ఇంటిదగ్గర మట్టి తొక్కుతుంటే రాహుల్ మీడియాకి ఫోన్ చేసి వీడియో తీసి న్యూస్ లో వేయమంటాడు. ఇంతలోగా రాహుల్ వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు మీడియా న్యూస్ లో వచ్చేటట్టు చూడు నేను ఇంట్లో గొడవ చేయడానికి చూస్తాను అంటుంది. కళ్యాణ్ అప్పు నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటారు కళ్యాణ్ కి లేఖ రాసిన అమ్మాయి పేరు కళ్యాణ్ చేతిలో ఉంటదని అమ్మాయి చెబుతుంది.

అప్పు కళ్యాణ్ చేతిని చూసి ఏం కనిపించడం లేదు కదా అంటుంది. ఇంతలో జాతకాలు చెప్పే అబ్బాయి వచ్చి నేనుండగా మీ జాతకాలు మీరే చూసుకుంటారు ఏంటి? అంటాడు. మీ చేతిలో ఉన్న రేఖలు గురించి నేను చెప్తానని ఆ జాతకాలు చెప్పుకునే అబ్బాయి అంటాడు. ఇంతలో కళ్యాణ్ నువ్వు నాకు జాతకం చెప్పు అవసరం లేదు నాకు అర్థమైంది అంటూ తనకి డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు. అప్పు నీకు డబ్బులు ఎక్కువ అయ్యాయా జాతకం చెప్పిచ్చుకోకుండానే ఎందుకు ఇచ్చావు అని అడుగుతుంది. ఆ అబ్బాయి క్లూ ఇచ్చాడు అందుకే డబ్బులు ఇచ్చి పంపించేసాను అని కళ్యాణ్ అంటాడు. దీంట్లో ఏముంది అని అప్పు అడుగుతుంది.

అప్పుడు కళ్యాణ్ మన చేతిలో రేఖలు ఉంటాయి అంటే తన పేరు ఆర్ అనే అక్షరంతో మొదలవుతుంది అంటాడు. అప్పు జి అని లెటర్ తో కూడా మొదలవొచ్చు కదా అంటుంది. జి అంటే ఏంటి బ్రో అని కళ్యాణ్ అడుగుతాడు. జి అంటే గీతలు అని కూడా అర్థం చేసుకోవచ్చు కదా అని అప్పు అంటుంది.అమ్మాయికి ఫోన్ చేసి ఫస్ట్ ఆర్ లెటర్ చెప్పు తప్పు అంటే జి లెటర్ చెప్పు అంటుంది అప్పు.
అమ్మాయి ఫోన్ నెంబర్ ఉంటే ఇంత కష్టం ఉండేది కాదు కదా అంటాడు కళ్యాణ్. దుగ్గిరాల వంశం మొత్తం అందరూ కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు. రాహుల్ వాళ్ళ అమ్మ టీవీ ఆన్ చేస్తుంది దాంట్లో కావ్య కనిపిస్తుంది అని అందరికీ చెబుతుంది.

ఇది కావ్య అత్తగారు చూసి ఇంటికాడ తింటూ అలా తిండికి గతి లేని దానిలాగా అక్కడ పని చేయడం ఏంటి పరువు తీయడానికే కదా ఇదంతా అంటుంది. మా మనవరాలు మా మనవరాలు అంటూ నెత్తినెక్కించుకున్నారు ఇప్పుడు చూడండి ఎలా చేసిందో ఇప్పుడు ఇంట్లో ఒక రానివ్వనా వద్దా అందుకే వాళ్ళ పుట్టింటితో బంధాలు కలపొద్దు అన్నాను అంటుంది అపర్ణ. ఎలా అందరూ కోపంలో ఉంటారు. కళ్యాణ్ అప్పు బస్టాండ్ లో నుంచునుంటే పక్కన షాప్ అబ్బాయి పిలిసి కళ్యాణ్ సార్ మీకు ఫోన్ వచ్చిందని చెబుతాడు.

కళ్యాణ్ కి లేఖ రాసిన అమ్మాయి ఫోన్ చేస్తుంది పేరు కనుక్కున్నావా అంటుంది. నీ పేరు.ఆర్ కానీ జీతో కానీ మొదలవుతుంది కదా అన్నాడు కళ్యాణ్. ఓయ్ మొద్దు కాదు ఉంగరానికి ఉన్న చిటికెన వేలు బట్టి కనుక్కో అని చెబుతుంది అప్పుడు కళ్యాణ్ అనామిక అని చెబుతాడు ఆవులు అంటుంది. నా పేరు కనుక్కున్నావ్ కదా నీకేం కావాలో చెప్పు అంటే కళ్యాణ్ నీ నెంబర్ ఇవ్వి అంటే 9 నెంబర్లు చెప్పి ఒక నెంబర్ కనుక్కో అంటుంది. అప్పు ఎంత లోగా ఫోన్ చెయ్ నెంబర్ ఇచ్చింది కదా అంటే 9 నెంబర్లు ఇచ్చింది వెనకదో ముందుదో ఒక నెంబర్ కనుక్కోవాలి అంటాడు కళ్యాణ్.

ఈ జన్మలో నువ్వు నాకు కనిపించకు అని చెప్పి అప్పు వెళ్ళిపోతుంది. బ్రో బ్రో అంటూ ఆపడానికి ప్రయత్నం చేస్తాడు కళ్యాణ్. రాజ్ ఆ వీడియో చూసి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంతలో గా కావ్య వాళ్ళ ఇంటికి తిరిగి వెళుతుంది. అందరూ కోపంగా ఉంటారు ఏమైంది చిన్న అత్తయ్య అని అడుగుతుంది కావ్య. నేనెందుకు చెప్పడం చెప్పే వాళ్ళు ఉంటారు కదా అని దానిలక్ష్మి ఉంటుంది. ఇంతలోనా రుద్రాణి వీడియో చూపిస్తుంది. ఏం చేసావు ఇప్పుడైనా అర్థమైందా అని అడుగుతుంది. నాకు దీన్ని చూస్తుంటే నా కష్టం కనిపిస్తుంది మీరు చూసే కోణంలో నేను చూడను అని కావ్య అంటుంది. అలా కావ్య చెప్తుండగా అపర్ణ గట్టిగా చాలాపు అని అరుస్తుంది. నిన్ను నేను కోడలిగా ఒప్పుకున్నా లేకపోయినా నా కొడుకు నిన్ను భార్యగా ఒప్పుకున్నా లేకపోయినా. ప్రపంచమంతా కలిపి నువ్వు దుగ్గిరాల ఇంటికి కోడలివి అని ఒక ముద్ర వేసింది నీకు అని చెబుతుంది.

అపర్ణ మేము ఇంటికి కోడలుగా వచ్చి ఇన్నేళ్లు అవుతున్న మేము ఏనాడు హద్దులు దాటలేదు. నువ్వు మాత్రం ఇంటి పరువు ఈదునా పెడుతున్నావు అంటుంది. చాలు ఆపండి దొంగతనం ఇలా అనేక చెయ్యకూడని పనులు చేస్తే దాన్ని తప్పంటారు నా కలని నేను గుర్తించడంలో ఎటువంటి తప్పు లేదనుకుంటున్నాను అని కావ్య అంటుంది. ఇంతలో రాజ్ వచ్చి చాలు ఆపు నీ కలని మేము గుర్తించడం లేదా నువ్వు డబ్బు గురించి కాదా ఇదంతా చేస్తున్నావ్ కలతో ఎందుకు ముడి పెడుతున్నావ్ అంటాడు.

ప్రోమో: రాహుల్ వచ్చి రాజ్ కి ఈ కాంట్రాక్ట్ ను దూరం చేస్తే కావ్య నీ దగ్గరకు వచ్చే హెల్ప్ అడుగుతుంది అని సలహా ఇస్తాడు. కావ్య వాళ్ళ ఇంటికి వెళ్లి శ్రీను ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను అంటాడు. ఎందుకు చేసుకుంటున్నారో చెప్పందే ఇక్కడి నుంచి కథల్ని ఇవ్వను అని కావ్య అంటుంది. ఎందుకంటే మీ ఆయన రాజ్ క్యాన్సిల్ చేసుకోమన్నాడు అని చెప్తాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అయింది.