మహేష్ బాబు మిస్సయ్యాడు ఆలీ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు..!

సినిమాల్లో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేసి హిట్టు కొట్టడం సర్వసాధారణం. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలలో చాలామంది హీరోలు వదులుకున్న కథలనే మరో హీరో చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వదులుకున్న ఎన్నో సినిమాలను రవితేజ చేసి సూపర్ హిట్ కొట్టి.. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు ఇక టాలీవుడ్ లో రెండు దశాబ్దాల క్రితం ఆసక్తికరమైన సంఘటన జరిగింది.

టాప్ కమెడియన్ ఆలీ కెరీర్లో యమలీల సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. కమెడియన్ ఆలీ ఎంటి హీరోగా సినిమా తీయటం అని అప్పట్లో చాలామంది విమర్శలు చేశారు. అయితే ఆలీని నమ్మిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఆయనతో హీరోగా సినిమా తీసి సూపర్ హిట్ కొట్టి అందరినోళ్లు మూయించారు. అంతకుముందు కృష్ణారెడ్డి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నెంబర్ వన్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. మనీషా ఫిలిమ్స్ బ్యానర్ పై అచ్చిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

ఈ క్రమంలోనే యమలీల సినిమా కథను కృష్ణ తనయుడు మహేష్ బాబుతో తెరకెక్కించాలని అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి అనుకున్నారు. ఒకరోజు కృష్ణ హైదరాబాద్ నుంచి చెన్నై ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు కృష్ణారెడ్డి అదే ఫ్లైట్లో వెళుతూ చెన్నై వెళ్లేలోగా కృష్ణకు కథ చెప్పేశారు. ఈ కథ విన్న కృష్ణ చాలా బాగుందని… అయితే మహేష్ ది అప్పటికి చిన్న వయసు కావడంతో మరో రెండు సంవత్సరాలు ఆగి సినిమా తీద్దామని చెప్పారట.

అయితే అప్పటికే ఆలీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాల్లో కమెడియన్ గా దుమ్ము దులిపేసాడు.. ఇటు సెంటిమెంట్ కూడా పండిస్తున్నాడు ఒక స్టేజ్ షోలో ఆలీ డ్యాన్స్ చూసిన కృష్ణారెడ్డి – అచ్చిరెడ్డి యమలీల సినిమాను ఆలీతో తీయాలని ఫిక్స్ అయిపోయారట. ఒకరోజు ఆలిని పిలిచి అడ్వాన్స్ చేతిలో పెట్టి నీతో సినిమా తీస్తున్నాం.. నువ్వే హీరో అని చెప్పగానే ఆలీ ఆశ్చర్య పోయాడట.

అయితే ఈ సినిమాకు ముందుగా యమస్పీడు అన్న టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత కథను బట్టి యమలీలగా మార్చారు. సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హీట్ అయిందో మనందరికీ తెలిసిందే. అలా మహేష్ చేయాల్సిన కథను ఆలీ చేసి బ్లాక్ బస్టర్ కొట్టడం విచిత్రం అనుకోవాలి.

Tags: Ali, film news, filmy updates, Filmyupdates, intresting news, latest news, latest viral news, mahesh babu, social media, social media post, Star hero, Star Heroine, Superstar, telugu news, Tollywood, trendy news, viral news, Yamagola