శ్రీదేవి డైలీ ఫుల్ బాటిల్ ఎత్తేస్తుందా… ఆమెకు మందు అల‌వాటు చేసింది ఆమేనా…!

సినిమా రంగంలో స్టార్ సెలబ్రిటీలుగా ఉన్నవాళ్లంతా ఏదో ఒక వ్యసనానికి వ్యాపకానికి అలవాటు పడిన వారే. మహా గొప్ప గొప్ప హీరోలు.. హీరోయిన్లు కూడా ఫుల్లుగా మందు కొట్టడం లేదా అమ్మాయిలు లేదా అబ్బాయిల పిచ్చితో వ్యవహరించటమో చేసినవారే. ఇప్పుడు అంటే కల్చర్ బాగా మారిపోయింది ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. దాదాపు నాలుగైదు దశాబ్దాల క్రితం కూడా సావిత్రి లాంటి స్టార్ హీరోయిన్లు మందుకు అలవాటు పడి కెరీర్ చివరలో జీవితాన్ని ఎలా ? నాశనం చేసుకున్నారొ చూశాం.

ఇక అతిలోకసుందరి శ్రీదేవి కూడా మందు కొట్టే వారట.. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. శ్రీదేవి దగ్గర పని చేసిన సీనియర్ సినీ విశ్లేషకులు ఇమంది రామారావు ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. శ్రీదేవి డైలీ ఒక ఫుల్ బాటిల్ ఎత్తేసే వారట. అయితే ఎంత మందు తాగినా కూడా ఆమె ఎప్పుడూ తూలిపడి ఎవరిని మాట అనేవారు కాదని.. చాలా కంట్రోల్ లో ఉండే వారిని ఆయన చెప్పారు. అయితే శ్రీదేవికి మందు తాగటం అనే అలవాటు చిన్నప్పటి నుంచి ఉందని ఆయన చెప్పి పెద్ద షాకే ఇచ్చారు.

శ్రీదేవి బాలనటిగానే సినిమాల్లోకి వచ్చింది. అప్పట్లోనే ఆమె కుటుంబం గడవని పరిస్థితుల్లో ఉంటే.. శ్రీదేవి బాలనటిగా సినిమాల్లో చేసిన డబ్బుతోనే కుటుంబం గడిచేదట. ఆ సమయంలో శ్రీదేవి ఇంటికి వచ్చాక అల్లరి చేస్తుంటే ఆమెను నిద్రపుచ్చేందుకు తల్లి ముందు అలవాటు చేసిందట. అలా చిన్నప్పటినుంచి ఆమె కొంచెం కొంచెం ముందుకు అలవాటు పడిందని.. స్టార్ హీరోయిన్ అయ్యాక కూడా ఆ అలవాటు అలాగే కంటిన్యూ చేసిందని రామారావు చెప్పారు.

అయితే ఆమె చాలా లిమిట్ గా మందు తీసుకునే వార‌ని.. ఒక ఫుల్ బాటిల్ ఎత్తేసిన ఎలాంటి ఇబ్బంది పడేవారు కాదని.. మందు తాగి ఎప్పుడూ గలాటా చేయటం ఆమె కెరీర్లో లేదని ఆయన తెలిపారు. ఇక శ్రీదేవి చనిపోయే ముందు కూడా మద్యం మత్తులోనే బాత్రూం లో పడి కాలుజారి చనిపోయిందన్న పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపై స్పందిస్తూనే రామారావు పై విషయన్ని బయటపెట్టారు.

Tags: bollywood heroine, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Sreedevi, sreedevi alcohol, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news