Madhavan :ఆ సినిమా కోసం ఇల్లు అమ్మేసిన స్టార్ హీరో.. అసలు విషయం చెపి షాక్ ఇచ్చిన హీరో..!

కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ (Madhavan) లీడ్ రోల్ లో ఆయన డైరెక్ట్ చేసి నిర్మించిన సినిమా రాకెట్రి. ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా కోసం మాధవన్ తన ఆస్తి అమ్ముకున్నాడని.. తన ఇంటిని సైతం అమ్మి రాకెట్రి సినిమా చేశాడని వార్తలు వచ్చాయి. అయితే ఇది విన్న మాధవన్ ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. అయ్యో పాపం అని జాలి కూడా చూపిస్తున్నారు.

అయితే ఈ వార్త అటు ఇటు తిరిగి మాధవన్ దాకా వెళ్లగా ఆయన ఈ వార్తలపై స్పందించారు. రాకెట్రి సినిమా కోసం తాను తన ఆస్తిని అమ్మినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పాడు మాధవన్ (Madhavan). ఈ వార్తలు ఇంతటితో ఆపాలని చెప్పాడు.

రాకెట్రి సినిమా కోసం మాధవన్ తన మేకోవర్ తో ఆడియెన్స్ ని మెప్పించాడు. సినిమా నిర్మాణంలో మాధవన్ ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమా తెరకెక్కించాడు.

Tags: Kollywood, Madhavan, Madhavan Movie, Nambi Narayanan, Rocketry