Krithi Shetty :గ్యాప్ కావాలంటున్న బేబమ్మ..!

ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఓవర్ నైట్ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి (Krithi Shetty) ఆ సినిమా తర్వాత అరడజను సినిమాల దాకా ఛాన్స్ అందుకుంది. శ్యాం సింగ రాయ్, బంగార్రాజు సినిమాలతో సక్సెస్ అందుకున్న బేబమ్మ ఈమధ్య వచ్చిన రెండు సినిమాలతో ఫెయిల్యూర్ ఫేజ్ చేసింది. రాం తో ది వారియర్ సినిమా చేసిన కృతి శెట్టి ఆ సినిమాతో అనుకోని అపజయాన్ని మూటకట్టుకుంది.

ఇక మరోపక్క నితిన్ తో మాచర్ల నియోజకవర్గం సినిమాతో కూడా అమ్మడు మరో ఫెయిల్యూర్ అందుకుంది. అయితే ఈ రెండు సినిమాల ఫలితాలతో కృతి శెట్టి (Krithi Shetty) కొద్దిగా డీలా పడినట్టు తెలుస్తుంది. అంతేకాదు సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆమె పాల్గొంటుంది. అయితే లేటెస్ట్ గా సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ కి కృతి శెట్టి కొద్దిగా గ్యాప్ కావాలని అంటుందట. సినిమా రిలీజ్ టైం లో తాను ప్రమోషన్స్ చేస్తా కానీ ప్రస్తుతం తనకు కొద్దిగా రెస్ట్ కావాలని అంటుందట. మొన్నటిదాకా ఆ రెండు సినిమాల కోసమే ప్రమోట్ చేసిన కృతి ఆ సినిమాలు ఇచ్చిన ఫలితాలతో నిరాశపడ్డదని తెలుస్తుంది.

Tags: AAGMC, Bebamma, Krithi Shetty, Sudheer Babu, Tollywood