Chandoo Mondeti : మరో ఛాన్స్ పట్టేసిన చందు మొండేటి..యంగ్ స్టార్ హీరోతో సినిమా..!

కార్తికేయ, ప్రేమమ్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు చందు మొండేటి(Chandoo Mondeti). కెరీర్ ఆరంభంలోనే మంచి సినిమాలు చేసి పేరు తెచ్చుకున్న చందు ఆ తర్వాత ఎందుకో అనుకున్నంత రేంజ్ లోకి వెళ్ళలేకపోయాడు. సవ్యసాచి వంటి ప్లాప్ సినిమాలు తీసి రేసులో వెనుకబడ్డాడు. తాజాగా అతడు నిఖిల్ తో చేసిన కార్తికేయ 2 సినిమా బంపర్ హిట్ కావడంతో చందు మొండేటి పేరు మళ్లీ వినపడుతోంది. ఈ క్రమంలో అతడు మరో సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ అందుకున్నాడు.

తన నెక్స్ట్ సినిమా గీతా ఆర్ట్స్ లో ఉంటుందని ఇటీవల చందు(Chandoo Mondeti) చెప్పిన సంగతి తెలిసిందే. దీన్ని అల్లు అరవింద్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావడంతో త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించనున్నట్లు తాజా సమాచారం.

వరుణ్ తేజ్ గత రెండు చిత్రాలు గని, ఎఫ్ 3 చిత్రాలు సరైన విజయాలు సాధించలేదు. దీంతో వరుణ్ కు ఒక సక్సెస్ మూవీ ఇచ్చేందుకు అల్లు అరవింద్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వరుణ్ కు కూడా ఈ కథ నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. వరుణ్ తేజ్ ఈ సినిమాతో పాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నారు. చందు మొండేటి వరుణ్ తేజ్ సినిమా తీసిన తర్వాత కార్తికేయ 3 కథ సిద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags: Chandoo Mondeti, geeta arts, tollywood news, tollywood ovies, varu taj