గొంతుకోశాడు.. నేరుగా న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు

అమ్మాయిని ఎంతో గాడంగా ప్రేమించాడు. సదరు ప్రియురాలు ఇటీవల కాలం నుంచి వేరొకరితో సన్నిహితంగా ఉండడాన్ని సహించలేకపోయాడు. నమ్మించి రూముకు తీసుకెళ్లాడు. బ్లేడ్‌తో కోసి హతమార్చాడు. నేరుగా వెళ్లి న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు. ఈ సంచలనం రేపిన ఈ సంఘటన వరంగల్‌లో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట పట్టణానికి చెందిన ఓ యువతి, యువకుడు కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో సదరు యువతి కొంత కాలంగా మరొక యువకుడితో సన్నిహితంగా ఉంటున్నది. ఈ విషయం తెలిసిన ప్రియుడు ఆమెను మందలించాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ క్రమంలో శుక్రవారం రోజున కాలేజీ ముగిసిన అనంతరం ప్రియురాలిని తన రూముకు తీసుకెళ్లాడు ప్రియుడు. ఇదే విషయమై మరోసారి వారిద్దరూ ఘర్షన పడ్డారు. దీంతో ఉన్మాదిలా మారిన ప్రియుడు యువతిపై బ్లేడ్‌తో దాడి చేశాడు. గొంతుకోసి హతమార్చాడు. అనంతరం నేరుగా వెళ్లి జడ్జి ఎదుట లొంగిపోయాడు. దీంతో సదరు యువకుడిని పోలీసులకు అప్పగించాడు న్యాయమూర్తి. అనంతరం పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. స్థానికులు ఈ సంఘటనతో ఉలిక్కిపడగా జిల్లాలో సంచలనం రేపింది.  ఇదిలా ఉండగా వరంగల్‌ జిల్లాలో వరుసగా ఇలాంటి దారుణాలు చోటుచేసుకుంటుండడం గమనార్హం. మొన్నటిమొన్న తొమ్మిది నెలల బాలికపై ఒకరు అత్యాచారానికి పాల్పడగా, ఇటీవలె యువతిని దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

Tags: khazipet, lover atteck girl with blede, warangal