పెళ్లయిన వ్యక్తితో ప్రేమ పెళ్లి.. రెండుసార్లు ఆత్మహత్య.. సీనియర్ స్టార్ హీరోయిన్ జీవితంలో ఎవరు ఊహించని మలుపులు ఇవే..!

అలనాటి మేటినటి జయప్రద గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం అవసరం లేదు. అందానికి అందం అభినయానికి అభినయం ఆమె సొంతం. స్టార్ హీరోలు అందరి స‌ర‌స‌న నటించిన హీరోయిన్ జయప్రద కేవలం తెలుగులో మాత్రమే కాకుండా అన్ని భాషల్లో కూడా ఈమె ఎన్నో సినిమాల్లో నటించింది. తెలుగు గడ్డపై పుట్టి బాలీవుడ్ లో తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో జయప్రద ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటుంది.

అదేవిధంగా సినిమాల తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా తనదైన ముద్ర వేసి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం జయప్రద బుల్లితెరపై షోలో జడ్జిగా కూడా వ్యవహరిస్తుంది. అయితే సాధారణంగా సెలబ్రిటీల జీవితాలు అన్నీ పైకి కనిపించే విధంగా ఉండవు.. వారి లోపల బాధలు ఎన్నో విషయాలు ఉంటాయి. ఇక జయప్రద విషయంలో కూడా అలానే జరిగింది. ఆమె పైకి ఎన్నో విజయాలు సాధించిన ఇంట్లో మాత్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. అందుకు కారణం ఆమె భర్త శ్రీకాంత్ స‌హత.

1986లో జయప్రద ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ స‌హతను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే శ్రీకాంత్‌కు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. జ‌య‌ప్ర‌ద‌ను ప్రేమించిన శ్రీకాంత్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక దాంతో శ్రీకాంత్ మొదటి భార్య చంద్ర జయప్రదను ఎన్నో హింస‌లు పెట్టిందట.. తన భర్త నుంచి విడిపోవాలని ఎంతో ఒత్తుటి కూడా తెచ్చిందట. 1990లో జయప్రద విషయం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా పాల్పడింది. అయితే ఆ స‌మ‌యంలో వెంటనే ఆసుప‌త్రికి తరలించగా వైద్యులు ఆమెను కాపాడారు.

ఆ తర్వాత కూడా వారి దాంపత్య జీవితం అంత సజావుగా నడవలేదు. ఈసారి అందుకు కారణం ఆమె పిల్లలు.. జయప్రదకు ఇప్పటివరకు పిల్లలు పుట్టలేదు. అయితే తనకు పిల్లలు పుట్టరు అని తెలిశాక తన సోదరి కుమారుడైన సిద్దార్థ్‌ను ఆమె దత్తత తీసుకుంది. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే జయప్రద జీవితంలో ఎన్నో వివాదాలు ఎన్నో విషాదాలు కూడా ఉన్నాయి. వాటన్నిటి నుంచి దాటుకొని వ‌చ్చి జ‌య‌ప్ర‌ద‌ నవ్వుతూ తన జీవనం కొనసాగిస్తుంది. ఆమె జీవితం గురించి తెలిసిన వారందరూ కూడా జయప్రద సిని కెరీర్ లో ఎంత విజ‌యం అందుకున్నా కూడా ఈ వ్యక్తి గ‌త‌ జీవితంలో మాత్రం ఆమె జీరోగా మిగిలిపోయిందని చెప్పుకొస్తున్నారు.