కోలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్కడు సినిమాలో తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ నటించార.. ఇక ఈ విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు అనుకుంటున్నారా మరి నిజంగానే శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బండి సంజయ్ నటించారా.. అనే విషయం ఇక్కడ మనం తెలుసుకుందాం. ఒక్కరోజు ముఖ్యమంత్రినే కాన్సెప్ట్‌తో వచ్చిన ఒకే ఒక్కడు సినిమాను అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో ముందుగా ఎంతో మంది స్టార్ హీరోలని అనుకున్నప్పుడు శంకర్ కి ఎవరూ డేస్ ఇవ్వకపోవడంతో చివరికి యాక్షన్ కింగ్ అర్జున్‌తో ఈ సినిమా చేసి బంపర్ హిట్ అందుకున్నాడు.
అదేవిధంగా ఈ సినిమా అందర్నీ ఎంతగానో అకట్టుకుంది. మరి ముఖ్యంగా రాజకీయ నాయకులకు చెమటలు పట్టించింది. ముందుగా ఈ సినిమా స్టోరీని శంకర్ అమెరికా ప్రెసిడెంట్ కి ఓ టీవీ యాంకర్ కి మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా ఈ కథను రాసుకుని సినిమాగా తెరకెక్కించారట. ఈ విషయాన్ని శంకర్ అప్పట్లో జరిగిన కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. ఈ ఒకే ఒక్కడు సినిమాలో ప్రస్తుత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ నటించారని సంగతి మీకు తెలుసా అంటూ తాజాగా సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారాయి.
అంతే కాకుండా ఆ సినిమాలోని బండి సంజయ్ కి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కోట్టడంతో అందరూ ఈ విషయం మాకు ఇప్పటి వరకు తెలియదే అంటూ ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయంలోకి వెళితే ఒకే ఒక్కడు సినిమా నుంచి తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో బయటకు వచ్చింది. మనం ఎన్నోసార్లు ఈ సినిమాను చూసి ఉంటాం.. ఆ ఫోటో కూడా చూసే ఉంటాం కానీ.. అందులో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ ఫోటో కనిపిస్తుంది.
అయితే ఆ ఫోటో చూసి మీరందరూ బండి సంజయ్ సినిమాలో నటించారని అనుకుంటే పప్పులో కాలేసినట్లే…ఎందుకంటే ఈ సినిమాలో నటించింది బండి సంజయ్ కాదట. బండి సంజయ్ లాగే కనిపిస్తున్న మరో వ్యక్తి. ఇక ఆ ఫోటో ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ఫోటో చూసి బండి సంజయ్ ఈ సినిమాలో నటించారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ ఫోటోలో ఉన్నది మాత్రం బండి సంజయ్ లాకే ఉండే మరో వ్యక్తి అని తెలుస్తుంది.