లోకేష్ దెబ్బ‌కు వైసీపీలో ఇంత టెన్ష‌న్ స్టార్ట్ అయ్యిందా…!

రాష్ట్రంలో వైసిపి అరాచక పాలనకు స్వస్తి పలకడానికి, రాష్ట్రంలోని సమస్యలను తెలుసుకోవడానికి, మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ప్రజల ముందుంచడానికి లోకేష్ యువ గళం పేరిట పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర విజయవంతంగా సాగింది. లోకేష్ పాదయాత్రకు భారీగా స్పందన కూడా లభించింది. కానీ అనూహ్యంగా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు తరువాత యువ గళం పాదయాత్రను ఆపివేశారు.

పూర్తిగా ఆగిపోయిందని వైసీపీ నేతలు అనుకుంటున్న తరుణంలో, చంద్రబాబు నాయుడు బెయిల్ పై బయటకు రావడంతో లోకేష్ తిరిగి యువ గళం పాదయాత్రను ప్రారంభించారు. మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని కూడా దాటింది. ఇప్పుడు లోకేష్ ప్రజలకు చేరువ కావడానికి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి, వాటిని విజయవంతం చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో నెల్లిమర్లలో యువ గళం పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ సభకు లక్షల్లో ప్రజలు వస్తారని టిడిపి శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పుడు టిడిపి జనసేన పొత్తులో ఉన్నందున టిడిపి అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు కూడా ఈ సభకు భారీగా వస్తారని అంచనా వేస్తున్నారు. జనవరిలో రాయలసీమలో ఒక బహిరంగ సభ, అమరావతిలో ఒక బహిరంగ సభ జరపాలని లోకేష్ ఆలోచనలో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సభలకు కూడా భారీగా ప్రజలు వచ్చి విజయవంతం చేస్తారని టిడిపి శ్రేణులు భావిస్తున్నారు… మరి ఏమవుతుందో…!