మంగ‌ళ‌గిరిలో మెజారిటీనే లెక్క… లోకేష్ విక్టరీ పక్కా… !

లోకేష్ నారా చంద్రబాబు నాయుడు కుమారుడిగా కన్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న నేత. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రెండు కీలకమైన శాఖలకు మంత్రిగా పనిచేశారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదని వైసిపి వారు విమర్శించారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేశారు. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో అతి తక్కువ మెజారిటీతో పరాజయం పొందారు. ఇప్పుడు అదే స్థానం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించాలని లోకేష్ పట్టుదలతో ఉన్నారు.

ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు.
మంగళగిరిలో బిసి సామాజిక వర్గ ఓటర్లే కీలకం కావడంతో జగన్మోహన్ రెడ్డి గంజి చిరంజీవులుకు మంగళగిరి టిక్కెట్ కేటాయించింది. మంగళగిరి ఇంచార్జిగా గంజి చిరంజీవుల పేరును ప్రకటించడంతో చాలామంది వైసీపీ నాయకులు ఆందోళనలో ఉన్నారు. లోకేష్ పై పోటీ అంటే మంచి పట్టున్ననేతను నిలబెట్టాలి. కాని సామాజిక వర్గ ఓటర్లతో గెలవచ్చు అని వైసిపి అధినాయకుడు భావించటం ఏంటో అని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నట్లు సమాచారం.

ప్రభుత్వంపై వ్యతిరేకత, ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు, గతంలో ఓటమి పొందడం వల్ల లోకేష్ కు ప్రజలలో ఉన్న సానుభూతి ఇవన్నీ కలిపి మంగళగిరిలో లోకేష్ కు భారీ మెజారిటీతో భారీ విజయాన్ని చేకూరుస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అభ్యర్థిని మార్చి లోకేష్ కు వైసిపినే విజయవకాశాలకు దారి చూపిందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే మంగళగిరిలో ఎగిరేది టిడిపి జెండానే… గెలిచేది నారా లోకేష్..!