టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. ఇప్పటికి సీమలో ని ఉమ్మడి నాలుగు జిల్లాలు. ఉమ్మడి ప్రకాశం, అదేవిధంగా నెల్లూరులోనూ ముగిసింది ప్రస్తుతం గుంటూ రు జిల్లాలో సాగుతోంది. అయితే.. ఏ రాజకీయ పార్టీకైనా.. ఏ నాయకుడికైనా ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఏ పనిచేసినా.. దానిలో తన పార్టీకి.. తనకు కూడా మేలు ఉందో లేదో అంచనావేసుకుంటారు.
అదేవిధంగా యువగళం పాదయాత్ర చేపట్టిన నారా లోకేష్ కూడా.. ఇలానే ఆలోచన చేస్తున్నారు. ఇక, పార్టీ పరంగా కూడా.. ఇదే తరహా ఆలోచన కనిపిస్తోంది. దీని ప్రకారం.. ఆయా జిల్లాల్లో పాదయాత్ర ముగి సిన తర్వాత.. పరిణామాలను ఐటీడీపీ సహా సీనియర్లు అంచనా వేస్తున్నారు. అన్ని విషయాలను సమ గ్రంగా విశ్లేషిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని తీసుకుని.. విశ్లేషణ చేస్తున్నారు. దీంతో యువగళం ఎఫెక్ట్ విషయం ఆసక్తిగా మారింది.
ప్రధానంగా సీనియర్ నాయకులు చెబుతున్న విషయాలను బట్టి.. మూడు కోణాల్లో యాత్రపై విశ్లేషణ జరిగింది.
1) యువత ఏమేరకు కనెక్ట్ అయ్యారు
2) నారా లోకేష్ పొలిటికల్ గ్రాఫ్
3) పాదయాత్ర ముగిసిన నియోజకవర్గాల్లో వైసీపీ-టీడీపీ గ్రాఫ్ ఎలా ఉంది?
ఈ మూడు విషయాలు కీలకంగా మారాయి. వీటిలో యువత ఈ యాత్రకు జోరుగానే కనెక్ట్ అయ్యారని అం టున్నారు. అదేవిధంగా నారా లోకేష్ పొలిటికల్ గ్రాఫ్.. గత నాలుగేళ్లతోపోల్చుకుంటే.. 100కు 100 శాతం పుంజుకుందని చెబుతున్నారు. అదేవిధంగా పాదయాత్ర సాగిన నియోజకవర్గాల్లో టీడీపీ గ్రాఫ్ కూడా పెరిగిందని.. వైసీపీ విషయంలోనూ.. పార్టీ నాయకుల విషయంలో ప్రజుల ఆలోచన చేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రాబల్య నియోజకవర్గాల్లో టీడీపీ సత్తా చాటుతుందని టీడీపీ సీనియర్లు చెబుతున్నారు.