ఈ పండును తిన్నే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇది అధికంగా లభించదు. ఆయుర్వేదంలో ఈ పండు గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఈ పండు పేరు ‘ స్కై ఫ్రూట్ ‘ తెలుగులో ఆకాశ పండు అంటారు. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించగలదు. కానీ ఇది మార్కెట్లో దొరకదు. అందువల్ల దీనిని తిన్నే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. దీనిని తిందామన్నా కూడా చాలా తక్కువ ప్రాంతాల్లో ఉంటుంది. ఆకాశ పండు ఇప్పటిది కాదు.. చాలా పాత పండే. ఆగ్నేయాసియా దేశాలలో దీనిని అధికంగా తింటారు. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది.
ఇది చూడడానికి కూడా కివి ఫ్రూట్ లా కనిపిస్తుంది. కానీ కివీ ఫ్రూట్ మెత్తగా ఉంటుంది. కానీ ఈ ఫ్రూట్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. దీని లోపల ఉన్న గింజలను బయటకు తీసేయాలి. ఇది రుచికరమైన పండు అయితే కాదు. అందుకే దీనిని తినే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. దీని రుచి చేదుగా ఉంటుంది. కానీ మన శరీరానికి మాత్రం బాగా పనిచేస్తుంది. మధుమేహం ఉన్నవారు ఈ పండును తింటే ఎంతో మంచిది. షుగర్ లెవెల్స్ 200 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు ఈ పండును తిన్నట్లయితే అమాంతంగా తగ్గిపోతుంది. దీని విత్తనాన్ని కూడా తినవచ్చు.
ఈ పండుని పొడి రూపంలో మార్చుకుని తినేవారు కూడా చాలామంది ఉన్నారు. ఈ పండును తినడం వల్ల గుండెపోటు రాకుండా చేస్తుంది. మలబద్ధకం, చర్మ ఎలర్జీలకు ఇది మంచి చికిత్స చేస్తుంది. శరీరానికి బలాన్ని ఇస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి వైరస్, బ్యాక్టీరియా నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఆస్తమా ఉన్నవారు ఈ పండుని తింటే ఎంతో మంచిది. రక్తనాళాలు మూసుకుపోకుండా పనిచేస్తుంది. కరోనా వైరస్ వంటి బారిన పడకుండా ఉంటాము.
స్త్రీలు రుతు స్రావం సమయంలో అధికంగా కడుపునొప్పి అనుభవిస్తుంటే… ఈ పండును తినడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. ఈ పండును సరిపడానే తినాలి. ఎందుకంటే అధికంగా తింటే కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ పండు తిన్నాక వికారంగా అనిపించినా, ఆకలి వేయకపోయినా, మూత్రం రంగు మారిన వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లడం చాలా ఉత్తమం. కళ్ళల్లోని తెలుపు రంగు కాస్త పసుపు రంగులోకి మారినా, చర్మం పసుపు రంగులోకి వెంటనే ఈ పండుని తినడం మానేయాలి. అలాగే డాక్టర్ని సంప్రదించాలి.