లావ‌ణ్య త్రిపాఠి – వ‌రుణ్‌తేజ్ ఎంగేజ్మెంట్‌.. క్లైమాక్స్‌లో ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిన బ‌న్నీ…!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరున్న మెగా హీరో వరుణ్ తేజ్ ఈ రోజు సొట్ట బుగ్గల సుందరి హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దాదాపు గత రెండు సంవత్సరాలుగా వీరిద్దరూ సీక్రెట్ గా ప్రేమాయణంలో మునిగి తేలుతున్నారు.

Lavanya Tripathi rubbishes rumours of marriage with Varun Tej Konidela |  Telugu Movie News - Times of India

గత ఏడాది లావణ్య బర్త్‌డే రోజు వరుణ్ తేజ్ కోటి రూపాయల డైమండ్ రింగ్ తో బెంగళూరు వెళ్లి మరి లావణ్య కు ప్రపోజ్ చేస్తాడన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై ఎవరు స్పందించలేదు. వీరిద్ద‌రి ప్రేమ‌ విషయం మెగా ఫ్యామిలీకి కూడా ముందే తెలుసు. పైకి చెప్పకపోయినా నాగబాబుతో పాటు కుటుంబ సభ్యులు అందరూ ఇప్పటికే లావణ్యను తమ ఇంటి కోడలుగా అంగీకరిస్తూ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

ఇక ఈరోజు ఎంగేజ్మెంట్ సందర్భంగా మెగా హీరోలు అందరూ తమ షూటింగులు క్యాన్సిల్ చేసుకుని మరి ఈ వేడుకకు హాజరవుతారని వార్తలు వచ్చాయి. ఎంగేజ్మెంట్ పత్రిక కూడా సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వైరల్ అవుతుంది. విచిత్రం ఏంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ రోజు దర్శకుడు సుకుమార్ కీలకమైన షెడ్యూల్స్ సీన్లు షూట్ చేయాల్సి ఉంది.

Varun Tej and Lavanya Tripathi's romantic pics

ఈ ఎంగేజ్మెంట్ అప్పటికప్పుడు ఫిక్స్ కావడంతో ఆ షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని మరి అల్లు అర్జున్ ఈ ఎంగేజ్మెంట్ కి అటెండ్ అవుతున్నాడు. ఇక ఎంగేజ్మెంట్ తర్వాత వరుణ్ తేజ్ – లావణ్య పెళ్లి తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. ఏది ఏమైనా లావణ్య త్రిపాఠి మొత్తానికి గారెల బుట్టలో పడింది. ఎంతో అదృష్టం ఉంటే కానీ మెగా ఫ్యామిలీ ఇంటర్ కోడలుగా అడుగుపెడుతుంది మరి..!