జూనియ‌ర్ ఎన్టీఆర్ బావ కూడా టాలీవుడ్ స్టార్ హీరో… తాత ఎన్టీఆర్ చేసిన పెళ్లి ఇది..!

నందమూరి నట వారసుడుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరో అయ్యాడు. తాత ఎన్టీఆర్‌కు తగ్గ మనవడిగా తెలుగు ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ నటనతో, డాన్స్ తో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మారాడు.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా న‌టిస్తోన్న త‌న కెరీర్ 30 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అసలు విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ బావ కూడా ఒక టాలీవుడ్ స్టార్ హీరో అన్న విషయం చాలామందికి తెలియదు. ఇంతకీ ఎవరు ఆ స్టార్ హీరో..? వడ్డే నవీన్ సినిమాలు గురించి చాలామందికి తెలుసుగాని.. ఆయన పర్సనల్ లైఫ్ లో నందమూరి కుటుంబానికి అల్లుడు అన్న విషయం ఎవరికీ తెలియదు.

జూనియర్ ఎన్టీఆర్ వ‌డ్డే నవీన్ కు బావమరిది అవుతాడు. మొదట వడ్డే నవీన్ నందమూరి ఫ్యామిలీకి చెందిన అమ్మాయినే వివాహం చేసుకున్నాడు. నందమూరి తారకరామారావు కుమారుడైన రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు నవీన్. ఈ సంబంధం ఎన్టీఆర్ స్వ‌యంగా కుదిర్చారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంతో విడాకులు తీసుకున్నాడు.

ఎన్టీఆర్ కు వ‌డ్డే న‌వీన్ భావే..కానీ నంద‌మూరి కుటుంబానికి అందుకే  దూర‌మ‌య్యారు..!

ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ‌డ్డే న‌వీన్ చాలా బాగుంది, ప్రేమించే మనసు, మనసిచ్చి చూడు, మా బాలాజీ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నడు. వడ్డే నవీన్ చాలా తక్కువ సినిమాల్లో నటించినా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కొన్ని పర్సనల్ కారణాల చేత సినిమాలకు దూరమైన వడ్డే నవీన్ మ‌రో అమ్మాయిని వివాహం చేసుకొని ప్రస్తుతం తన జీవితాన్ని గడుపుతున్నాడు.

సినిమాలకు దూరంగా ఉన్నా వడ్డే నవీన్ రియల్ లైఫ్ లో ఎంతో హ్యాపీగా ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే త్రిబుల్ ఆర్ తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్.. తన 30 వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.