ఆడియన్స్ బోర్ ఫీలవుతున్నారు.. అందుకే కొత్త ప్రయోగం చేస్తున్నా..

అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ లావణ్య త్రిపాఠి.. తొలి సినిమాకే కుర్రకారును మంత్రముగ్ధులను చేసింది. ఎన్ని విజయవంతమైన సినిమాల్లో నటించింది. కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను చూసింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ప్రేమకథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ తన రూట్ మార్చేసింది. తన సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే కసితో ఉంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాలో ఫైట్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయట. అందుకే ఫైట్స్ సీన్స్ లో నటించేందుకు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటోంది. ఫ్యామిలీ మూవీస్ నుంచి యాక్షన్ సినిమాల వైపు వచ్చేందుకు గత కారణాన్ని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది..

అసలు లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ని వదిలి యాక్షన్ వైపు రావడంపై లావణ్ త్రిపాఠి మాట్లాడుతూ.. ‘లవ్ స్టోరీస్ సినిమాల్లో హీరోకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోయిన్ ని రక్షించేందుకు హీరో ముందుకొచ్చేవాడు. ఇలాంటి సినిమాల్లో నేను సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవడం చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నాను.. ఎప్పుడూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చేస్తే ప్రేక్షకులు బోర్ ఫీలవుతున్నారు. అందుకే ఈ సారి రూట్ మార్చేశా.. స్టోరీస్ సెలక్షన్ లో ప్రయోగాలు చేస్తున్నాను’ అంటూ ఈ అందాల రాక్షసి చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాలను మాత్రం వెల్లడించలేదు..

ఇక ఫైట్స్ సీన్స్ లో ప్రాక్టీస్ చేసే వీడియోను కూడా లావణ్య త్రిపాఠి ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంటుంది. ప్రాక్టీస్ మిమ్మల్ని పరిపూర్ణవంతులను చేస్తుంది అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. లావణ్య త్రిపాఠి ప్రాక్టీస్ సెషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…

Tags: different movies, Lavanya Tripathi, new movies, Tollywood heroine