ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి శెట్టి.. తొలి సినిమాతోనూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనతికాలంలోనూ మంచి పేరు తెచ్చుకుంది. తొలి సినిమా విజయంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు క్యూ కట్టాయి. వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వరుసగా మూడు విజయాలు సాధించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడి కెరీర్ కి ఇప్పుడు ఫ్లాప్ లు చుట్టుముట్టాయి..
రామ్ పోతినేని సరసన ‘ది వారియర్’ చిత్రంలో నటించింది కృతి శెట్టి.. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. వరుసగా మూడు విజయాల తర్వాత ఆమె కెరీర్ లో ఇది మొదటి ఫ్లాప్.. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ‘మాచర్ల నియోజకవర్గం’ కూడా నిరాశ పరిచింది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా ఈ బ్యూటీకి మంచి ఆఫర్లే వస్తున్నాయి..
వరుసగా రెండు ఫ్లాపులు రావడంతో కృతి శెట్టి భయపడినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఆమెకు హిట్ పడకపోతే.. కెరీర్ గల్లంతయ్యే ప్రమాదం ఉంది. అందుకే సినిమా హిట్ కావాలని గుడిలో పూజలు చేస్తుందట.. తన తల్లితో కలిసి గుడికి వెళ్లి పూజలు చేసింది. తన సినిమా విజయం సాధిస్తే దేవుడికి వెండి కిరీటం బహూకరిస్తానని మొక్కులు మొక్కినట్లు టాక్.. కృతి శెట్టి ప్రస్తుతం సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్లు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా హిట్ అవ్వాలని కృతి శెట్టి పూజలు చేసింది. మరీ ఆ దేవుడు కృతి శెట్టి కోరికను తీరుస్తాడా? లేదా అన్నది చూడాలి..