‘మాయాబజార్’లో ఈషా.. రానా దగ్గుబాటి నిర్మాణంలో థ్రిల్లర్ మూవీ..

మన తెలుగు అమ్మాయి ఈశా రెబ్బ.. ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా ఇప్పటీకి ఈ బ్యూటీకి సరైన హిట్ రాలేదు.. తెలుగు సినిమాల్లో అంతగా గుర్తింపు రాకపోవడంతో.. తమిళ చిత్రాలపై దృష్టి పెట్టింది. చిన్న బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ పాపులారీటి పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఇటు సినిమాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది.. తెలుగులో వెబ్ సిరీస్ లు చేస్తోంది. ఇప్పటికే ‘త్రీ రోజెస్’లో నటించింది. రీసెంట్ గా ‘మాయబజార్’ అనే మరో వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘పాష్ పోరీస్’, ‘మన ముగ్గురి లవ్ స్టోరీ’ వంటి సిరీస్ లకు రైటర్ గా పనిచేసిన గౌతమి చల్లగుల్ల ‘మాయా బజార్’ సిరీస్ కి దరకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇటీవల గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. రానా దగ్గుబాటి ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్ లో నరేష్, ఝాన్సీ, రవి వర్మ, హరితేజ, సునైన తదితరులు నటిస్తున్నారు. ఇక స్టోరీ విషయానికి వస్తే.. ఈ సిరీస్ మొత్తం ‘మాయా బజార్’ అనే గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ తిరుగుతుంది.. అక్కడ ఎంతో మంది విల్లాలు కొనుగోలు చేస్తారు. కొన్న వారిలో కొత్తగా పెళ్లయిన జంటలు, వయసు మీద పడిన వారు ఉంటారు. అయితే ప్రారంభోత్సవం రోజున ఆ గేటెడ్ కమ్యూనిటీ బ్రాండ్ అంబాసిడర్ అయిన ఓ సెలబ్రిటీ చనిపోతాడు. క్లబ్ హౌస్ టెర్రస్ మీద నుంచి పడి ప్రాణాలు కోల్పోతాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపుతు తిరగిందనేది స్టోరీ.. ఇది ఓ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించిన స్టోరీ.. ఈ సినిమాతో ఈషా రెబ్బకు ఎలాంటి ఫేమ్ వస్తుందో చూడాలి..

Tags: Isha Rabba, Rana Daggubati, Telugu cinemas, Tollywood actress, Tollywood heroine