సౌత్‌లో ఆ హీరోతో నటించొద్దంటూ..జాన్వి కి వింత కండిషన్ పెట్టిన బోని క‌పూర్‌..

దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ధడక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న జాన్వి తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటుంది. అయితే శ్రీదేవి 1980 -90 కాలంలో దక్షిణాది స్టార్ హీరోయిన్గా వెలిగిన సంగతి తెలిసిందే. అదే విధంగా తల్లి బాటలోనే జాన్వి కూడా దక్షిణాది సినిమాల్లో నటించడానికి ఎంతో ఆసక్తి చూపుతుంది. ఆమె అనుకున్న విధంగానే ఎట్టకేలకు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది.

దీంతో పాటే తమిళ సినిమాల్లోనూ ఆమె నటించాలని ఆశపడుతుందట. అందులో భాగంగా తమిళ సినిమాలను ఎక్కువగా చూస్తుందని సమాచారం. ఈ క్రమంలో బోని కపూర్ జాహ్నవికి ఓ కండిషన్ పెట్టాడని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరో ధనుష్ కు జంటగా ఆమెను నటించవద్దని చెప్పినట్లు సమాచారం. విజయ లేదా అజిత్ సినిమాల ద్వారా కోలీవుడ్‌కి కూతురిని పరిచయం చేయాలని బోని కపూర్ భావిస్తున్నాడట.

ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ సరసన జాన్వి న‌టించ‌కుండా బోని కండిషన్ పెట్టడానికి కారణం ఏమై ఉంటుందని అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ప్ర‌స్తుతం జాన్వి దేవ‌ర షూటింగ్‌లో బిజీగా ఉంది.