తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సౌందర్య.. మొన్నటి తరం హీరోయిన్ సావిత్రి తర్వాత అంతటి స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. కన్నడ అమ్మాయే అయినా.. అచ్చ తెలుగు అమ్మాయి అనేంతలా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక గ్లామర్ పాత్రలకు ఆమె అమడ దూరం.. ముద్దు సీన్లకు కూడా ఆమె దూరంగా ఉండేవారు. చిరంజీవి, వెంకటేష్ తో పాటు అప్పటి స్టార్స్ అందరితో నటించారు.. ముఖ్యంగా వెంటకేష్, సౌందర్యల జోడి ఇండస్ట్రీలో బెస్ట్ రీల్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే చిన్న హీరోలతో నటించడానికి ఆమె ఇన్ సెక్యూర్ గా ఫీల్ అయ్యేది కాదు. అందుకే దర్శక నిర్మాతలు ఆమె గురించి చాలా గొప్పగా చెబుతుంటారు..
అయితే దురదృష్టవశాత్తు 2004లో ఆమె ఎవరూ ఊహించని విధంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమదంలో ఆమె సోదరుడు అమర్ కూడా చనిపోయాడు. ఇక చనిపోయే నాటికి సౌందర్యకు వివాహం జరిగింది. 2003లో తన చిన్న నాటి స్నేహితుడు రఘును ఇంట్లో పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది.రఘు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసవారు. సౌందర్యతో పెళ్లయిన ఏడాదిలోనే ఆమె మరణించడంతో రఘు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు..
ఆ తర్వాత చాలా కాలం పాటు రఘు ఒంటరి జీవితాన్ని గడిపారు. తర్వాత 2011లో అపూర్వ అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. రఘు ప్రస్తుతం గోవాలో స్థిరపడినట్లు తెలుస్తోంది. ఇక సౌందర్య నివాసం ఉండే ఇల్లు పాతబడిపోయింది. అది ఇప్పుడు ఒక భూత్ బంగ్లాగా తయారైంది.. ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. సౌందర్యకు ఆస్తులు బాగానే ఉన్నాయి. ఆ విషయంలో సౌందర్య తమ్ముడు, ఆమె తల్లి, భర్త రఘుకు గొడవలు జరిగినట్లు సమాచారం. సౌందర్య ఆస్తి ఎవరికీ వెళ్లందనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రఘు కూడా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది..