Chennakesava Reddy : గెట్ రెడీ చెన్నకేశవరెడ్డి వస్తున్నాడు.. నందమూరి ఫ్యాన్స్ భారీ ప్లాన్..!

Chennakesava Reddy : నందమూరి ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్. నందమూరి నట సిం హం బాలకృష్ణ నటించిన చెన్నకేశ్వర రెడ్డి సినిమాని రీ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట. ఈమధ్య స్టార్ సినిమాల 4కె ప్రింట్ అంటూ రీ రిలీజ్ చేసి హంగామా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ పోకిరి, ఒక్కడు సినిమాలతో మొదలైన ఈ రీ రిలీజ్ హంగామా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జల్సా, ఖుషి సినిమాలతో కొనసాగింది. ఈమధ్య మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఘరానా మొగుడు సినిమా కూడా రీ రిలీజ్ చేశారు.

ఇక ఇప్పుడు బాలయ్య వంతు వచ్చింది. చెన్నకేశవ రెడ్డి సినిమాని రీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. వివి వినాయక్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ సినిమా రీ రిలీజ్ ని కూడా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. (Chennakesava Reddy) ముఖ్యంగా ఓవర్సీస్ నందమూరి ఫ్యాన్స్ అక్కడ భారీ రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.

చూస్తుంటే ఈ రీ రిలీజ్ హవా ఇంకొన్నాళ్లు కొనసాగిచేలా ఉన్నారు. ఎన్ని కొత్త సినిమాలు వస్తున్న తమ స్టార్ హీరోల అప్పటి సినిమాలు మళ్లీ వెండి తెర మీద చూడటం ఫ్యాన్స్ కి సూపర్ కిక్ అందిస్తుంది. తప్పకుండా చెన్నకేశ్వర రెడ్డి రీ రిలీజ్ కూడా రికార్డ్ కలక్షన్స్ రాబడుతుందని చెప్పొచ్చు.

Tags: balakrishna, chennakesava reddy, NBK, Re Release, Shriya, Tabu, Tollywood, v.v.vinayak