ఆ హీరోయిన్ ఒరిజనల్ లుక్ అలా ఉంటుందా?

ఇటీవల ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మృణాల్ ఠాకూర్.. ఈ మూవీలో ఆమె పోషించిన సీత పాత్ర సినిమాకే హైలైట్ అని చెప్పాలి.. మృణాల్ ఠాకూర్ అందం, నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాలో ఆమె నటనపై ఇప్పటికే పలువురు ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు కురిపించారు. ఇక సీతారామం హిట్ కావడంతో ఈ బ్యూటీకి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ మంచి పాపులారీటీ సంపాదించుకుంది.

సీతారామం విడుదల తర్వాత ఈ అమ్మడిని ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా పెరిగింది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం హాట్ ఫొటో షూట్లు చేస్తోంది.. ఈ మధ్య కాలంలో మృణాల్ ఠాకూర్ అనే పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది.. తాజాగా మృణాల్ ఠాకూర్ కు సంబంధించిన ఓ పాత ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. ఆ ఫొటోలో మృణాల్ ఠాకూర్ ను చూసిన వారు షాక్ అవుతున్నారు. ఆ ఫొటోపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలో మృణాల్ ఠాకూర్ చేతులు, ముఖం నల్లగా ఉన్నాయి. మృణాల్ ఠాకూర్ కి ఈ ఫొటోలో కనిపిస్తున్న ఆమెకు అసలు పోలిక లేదంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది అసలు ఒరిజినల్ ఫొటో కాదంటూ మరికొందరు చెబుతున్నారు. ఆమెకు స్కిన్ అలెర్జీ వచ్చిందని, అందకే ఆ ఫొటోలో కమిలిపోయి నల్లగా కనిపిస్తుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కానీ ఈ ఫొటో ఆమెదో.. కాదో ఎవరికీ తెలియడం లేదు. మరి కొంతమంది మాత్రం తన నెక్ట్స్ మూవీ కోసం మృణాల్ ఠాకూర్ వేసిన గెటప్ అని అంటున్నారు. ఈ ఫొటో తనదో కాదో మృణాల్ ఠాకూర్ స్పందిస్తేనే నిజం ఏంటో తెలుస్తుంది.. అయితే మృణాల్ ఠాకూర్ ని అలా నల్లగా చూసి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.

Tags: latest news, news viral, photos, Sitaram beauty, viral latest