టీ షర్ట్ లోపల పెట్టుకుంటా.. దమ్ముంటే తీసుకోండి..

బిగ్ బాస్ సీజన్ 6 మొదటి వారం అయిపోయింది.. ఈ వారం వరెస్ట్ పెర్ఫామర్ గా గీతు రాయల్ ఎంపికైంది. కంటెస్టంట్స్ అందరూ వరెస్ట్ పెర్ఫామర్ గా గీతును ఎంపిక చేసి జైలుకు పంపారు.. షో మొదలైనప్పటి నుంచి కంటెస్టంట్స్ పై పైచేయి సాధించాలని చూసింది. ప్రతిఒక్కరితో గొడవకు దిగింది. దీంతో పాటు చాలా రాష్ గా మాట్లాడం చేసింది. గేమ్స్ ఆడేటప్పుడు గీతు స్ట్రాటజీలను ప్లే చేస్తూ.. ఓవర్ గా మాట్లాదింది.

థర్మాకోల్ బాల్స్ గేమ్ లో లెటర్స్ సర్చ్ చేసేటప్పుడు గీతు అన్ని లెటర్స్ ని తన చేతిలో పట్టుకుని వేరే కంటెస్టంట్లకు దొరక్కుండా చేసింది. గీతు అలా చేయడాన్ని మెరినీ వ్యతిరేకించింది. దీంతో గీతు కొంచెం రెచ్చిపోయి మాట్లాడింది. చేతిలో కాదు నా టీషర్టులో పెట్టుకుంటానని, దమ్ముంటే తీసుకోవాలని, అదే గేమ్ అని చాలా వల్గర్ గా మాట్లాడింది..

ఇక గేమ్ అయ్యాక హౌస్ మేట్స్ అందరూ కలిసి గీతు రాయల్ కి క్లాస్ తీసుకున్నారు. గర్ల్స్ బాల్స్ ని టీషర్ట్ లో, ప్యాంట్ తో దాచుకుంటే బాయ్స్ ఎలా ఆడుతారంటూ ప్రశ్నించారు. గీతు వారితో కొద్దిసేపు వాదించింది. గీతు వాదనను మెరీనా, శ్రీసత్, కీర్తి వ్యతిరేకించి గీతు నోరు మూయించారు.. గీతు ఆడిన అన్ ఫెయిర్ ఆటను ఆరోహి రావ్ బయటపెట్టింది. గీతు బాక్స్ లోని కీస్ తీసుకొచ్చి వేరే కంటెస్టంట్స్ టబ్ లో వేసిందని, ఇలా ఎందుకు వేశావ్ అని అడిగితే లైట్ తీసుకో అని చెప్పిందని ఆరోహి చెప్పింది.

ఇక కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత వీకెండ్ వరస్ట్ పెర్ఫామర్ ఎవరూ? అని హౌస్ లో కంటెస్టంట్స్ ని బిగ్ బాస్ ప్రశ్నించాడు. దీనిపై అభిప్రాయలు తెలియజేయాలని చెప్పాడు. దీంతో హౌస్ లో చాలా మంది గీతు రాయల్ పేరు చెప్పారు. ఆమె ముఖానికి స్టాంపులు వేశారు. ఎక్కువ స్టాంపులు పడటంతో గీతు వరస్ట్ పర్ఫామర్ గా జైలుకు వెళ్లింది. వీకెండ్ లో నాగార్జున ఈ టాస్క్ గురించి ఏం మాట్లాతారు అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు..

Tags: Bigg Boss 6, comments, latest news, season, Star Maa, t-shirt, viral