రఘువరన్ కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?రఘువరన్ కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

ఒకప్పటి విలన్ రఘువరన్ గుర్తుండే ఉంటారు.. విలనిజంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తనదైన ముద్ర వేసుకున్నారు. తెలుగులో శివ, పసివాడి ప్రాణం వంటి సినిమాల్లో విలన్ గా, అంజలి చిత్రంలో తండ్రిగ అద్భుతమైన నటన కనబరిచారు. పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమాలో తండ్రి పాత్రలో రఘువరన్ ఎంతో అద్భుతంగా నటించారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో మందుకు బానిసయ్యారు. ఆయన లివర్ దెబ్బతినటంతో పాటు ఇతర అవయవాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో చిన్న వయసులోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు.

నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన రఘువరన్ నటి రోహిణిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తల్లి పాత్రలలో నటిస్తున్నారు. రఘువరన్ గురించి మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే.. ఆయన ఓ మంచి గాయకుడు. ఆయన చనిపోవడానికి ముందు రఘువరన్ ఎన్నో ఆల్బమ్స్ చేశారు.. ఆయన చేసిన ఆల్బమ్స్ అన్నింటినీ భార్య రోహిణి ఒక డివిడి రూపంలో తయారు చేయించి సూపర్ స్టార్ రజనీకాంత్ చేత విడుదల చేయించారు.

ఇక రఘువరన్, రోహిణి దంపతులకు సాయి రిషి వరుణ్ అనే కుమారుడు ఉన్నాడు. రిషి అమెరికాలో చదువుతున్నట్లు రోహిణి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రిషి ప్రస్తుతం హీరోగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రి రఘువరన్ విలన్ గా ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నారో.. హీరోగా రిషి కూడా అంతకు మించి గుర్తింపు పొందాలని చూస్తున్నారట.. తన తండ్రి ఆల్బమ్ విడుదల సమయంలో మొదటి సారిగా రిషి మీడియా ముందుకు వచ్చాడు. ఈ విషయాన్ని తల్లి రోహిణి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అసలు రోహిణి తన భర్తకు పాటల మీద దృష్టి పెట్టాలని కోరారట.. అయితే నటనతో పాటు పాటల మీద దృష్టి పెట్టలేనని రఘువరన్ చెప్పేరట..

Tags: movie news, Raghuvaran, Rajnikant, Star hero, star villain