యష్ నటించిన ‘కేజీఎఫ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటి శ్రీనిధి శెట్టి.. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘కేజీఎఫ్ పార్ట్ 2’ కూడా భారీ విజయం సాధించింది. రెండు భాగాలు పెద్ద హిట్ కావడంతో శ్రీనిధికి మంచి పేరు వచ్చింది. ఇక తన అందం..నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేజీఎఫ్ రెండు భాగాలు మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీ రేంజ్ మారిపోయింది. పాపులారిటీ పెరగడంతో మేకర్స్ ఆమెతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు.. దీంతో ఈ అమ్మడి తన రెమ్యూనరేషన్ కూడా డబుల్ చేసేసింది..
శ్రీనిధి శెట్టికి అవకాశాలు కూడా భారీగా వస్తున్నాయి. అయితే సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. వచ్చిన అన్ని సినిమాలు ఓకే చేయడండా కేవలం సెలక్టివ్ సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది ఈక్రమంలో ఇటీవల చియాన్ విక్రమ్ హీరోగా నటించిన భారీ ప్రాజెక్ట్ ‘కోబ్రా’లో నటించింది. కోబ్రా చిత్రంలో నటించడానికి శ్రీనిధి రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్లు డిమాండ్ చేసిందని టాక్.. దీంతో సౌత్ లో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో శ్రీనిధి ఒకరు..
అయితే ఈ బ్యూటీకి ఊహించని షాక్ తగిలింది. రీసెంట్ గా వచ్చిన ‘కోబ్రా’ మూవీ నిరాశపరిచింది. ఈ సినిమాలో విక్రమ్ నటనకు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. 10 గెటప్స్ లో విక్రమ్ ఆకట్టుకున్నారు. సినిమా ఫ్లాప్ కావడంతో శ్రీనిధికి ఇది ఊహించని దెబ్బే.. కోబ్రా సినిమా హిట్ అయితే ఇంక పెద్ద హీరోలతో చేసే అవకాశం వస్తుందని ఈ బ్యూటీ భావించింది. కానీ ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఆమె ఆశలన్నీ గల్లంతైనట్లే అనిపిస్తోంది.. దీంతో ఈ బ్యూటీ చాలా ఫీల్ అవుతుందట.. వచ్చిన ఆఫర్లను ఒప్పుకున్నట్లైతే బాగుండేదని భావిస్తోందట.. కోబ్రా సినిమా ఫ్లాప్ కావడంతో శ్రీనిధి శెట్టికి ఆఫర్లు వస్తాయో.. రావో చూడాలి..