ఆ హీరోతో లిప్ లాక్ – బెడ్ సీన్స్.. కృతిశెట్టి బోల్డ్ కామెంట్స్ కి దండం పెట్టాల్సిందే..!!

ట్రెడిషనల్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోగా తెర‌కెక్కిన ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుస ఛాన్సులతో దూసుకు వెళ్తున్న ఈ ముద్దుగుమ్మ నేచుర‌ల్ స్టార్ నానితో శ్యామ్ సింగరాయ్, నాగచైతన్యతో బంగార్రాజు లాంటి హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. కస్టడీ అనే సినిమాతో ఇటీవల మరోసారి నాగచైతన్యత జత కట్టింది ఈ ముద్దుగుమ్మ.

వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ప్రియమణి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్ డ్‌ టాక్ తెచ్చుకుంది. సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోసే చాలామంది స్టార్ హీరోయిన్ల‌కు భిన్నంగా ఉంటుంది కృతి శెట్టి. దాదాపు సాంప్రదాయపద్ధమైన పాత్రల్లో నటించడానికి ఇష్టపడుతుంది.

ఇటీవల రిలీజ్ అయిన కస్టడి సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న కృతిశెట్టిని బోల్డ్ సన్నివేశాల గురించి అడిగితే చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఐటమ్ సాంగ్స్ ఆఫర్లు వస్తే చేస్తారా..? అని ప్రశ్నించగా అందుకు కృతిశెట్టి నో అని చెప్పేసింది. నాకు వాటిపై అసలు ఏమాత్రం ఆసక్తి లేదని నాకు అసౌకర్యంగా అనిపిస్తే నేను అసలు చేయలేనని.. శ్యామ్ సింగరాయ్ మూవీ టైంలో కూడా నేను నానితో లిప్ లాక్, బోల్డ్ సన్నివేశాల్లో మనస్ఫూర్తిగా నటించలేకపోయానని తెలిపింది.

అలాంటి బోల్డ్ సన్నివేశాల్లో నటించడం నాకు అసలు కంఫర్ట్ గా అనిపించలేదని.. మనసుకు నచ్చిన పనులు చేయకూడదని అప్పుడే డిసైడ్ అయ్యానని కృతి శెట్టి చెప్పుకొచ్చింది. దీంతో కృతి శెట్టి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ న్యూస్ విన్న చాలా మంది నేటిజ‌న్స్ ఈరోజుల్లో కూడా ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారా అని షాక్ అవుతున్నారు.

Tags: celebrities news, krithishetty, latest film news, latest filmy updates, latest news, Nani, shyam singaroy, social media, Star hero, Star Heroine, telugu news, Tollywood, viral news