మోహన్ బాబు కాలేజీలో చదువుకున్న స్టూడెంట్.. ఇప్పుడో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?

మంచు మోహన్ బాబు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరోగా, విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మోహన్ బాబు హీరోగా నటించిన సినిమాల కంటే విలన్ గా నటించిన సినిమాలే ఎక్కువ. ఎక్కువ‌ సినిమాల్లో విలన్ గా నటించి… ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకోవాలి అంటే మామూలు విషయం కాదు. ఆ త‌ర్వాత హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడంటే మోహన్ బాబుకు అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో అర్దంచేసుకోవ‌చ్చు.

ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చిరంజీవి, రజనీకాంత్, కృష్ణంరాజు వంటి ఎంద‌రో విలన్ గా. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించిన తరువాతనే హీరోలుగా మారారు. అయితే మోహన్ బాబు నటించిన అని విల‌న్ రోల్స్ లో వీరెవరు నటించలేదు. ఇక అసలు విషయానికి వస్తే మోహన్ బాబు విద్యానికేతన్ సంస్థలో చదువుకున్న చాలా మంది డిసిప్లైన్ కి పేరుగా ఉంటారు.

వారిలో చాలామంది విదేశాల్లో ఉన్నత పదవుల్లో కూడా కొనసాగుతున్నారు. అంతేకాదు మరి కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ పొజిషన్ కి కూడా చేరుకున్నారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరో ఒక ఆర్టిస్ట్ చనిపోతే అతని కుమార్తెను తమ కాలేజీలోనే ప్రిగా చదివించాన‌ని ఇప్పుడు ఆమె ఒక పెద్ద స్టార్ హీరోయిన్.. ఆమె పేరు అంతగా గుర్తు రావడంలేదని చెప్పారు.

ఆ హీరోయిన్ ఎవరై ఉంటుంది అని సెర్చింగ్ ప్రారంభించారు కొంత మంది నెటిజ‌న్స్. ఇంతకీ ఆమె ఎవరో కాదు నటుడు రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్. ఆమె ప్రస్తుతం సౌత్ సినిమాలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అలాగే టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలో నటించింది ఐశ్వర్య. ఇక మోహన్ బాబు విషయానికొస్తే సినిమా రంగంలోనే కాక విద్యా సంస్థల రంగంలోనూ సూపర్ సక్సెస్ అందుకున్న విషయం అందరికీ తెలుసు.

Tags: Aishwarya Rajesh, celebrities news, latest film news, latest filmy updates, latest news, mohan babu, social media, Star hero, Star Heroine, telugu news, Tollywood, viral news