రెబల్ స్టార్ కృష్ణం రాజు (Krishnam Raju) వెండితెర మీద తన మార్క్ చూపించారు. ఆయన తీసిన సినిమాలు మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరగా ఉండేవి. దాదాపు 190 సినిమాల దాకా నటించిన కృష్ణం రాజు ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో కృష్ణం రాజు తీరని కోరికల గురించి బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఓ నవలని కృష్ణం రాజు సినిమాగా తీయాలని అనుకున్నారు. కానీ అది కుదరలేదు.
విశాల నేత్రాలు అనే నవలని సినిమాగా చేయాలన్ అనుకున్నారట కృష్ణం రాజు (Krishnam Raju). కానీ అది నెరవేరలేదు. విశాల నేత్రాలు నవలని ఎంతగానో మెచ్చిన కృష్ణం రాజు ఆ కథ్తో సినిమా చేయాలని అనుకున్నారట. కానీ అది జరగలేదు. ఇక ప్రభాస్ మ్యారేజ్ కూడా చూడాలని కృష్ణం రాజు తెగ ఆరాటపడ్డారట.
ప్రభాస్ కి సపోర్ట్ గా అతన్ని గైడ్ చేస్తూ వచ్చిన కృస్ణం రాజు మృతి పట్ల సినీ ప్రేక్షకులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. కృష్ణం రాజుతో తమకున్న అనుబంధాన్ని సినీ ప్రముఖులు పంచుకుంటున్నారు.