బిగ్ బాస్ సీజన్ 6 (BiggBoss 6) లో మొదటి వారం ఏడుగురు హౌజ్ మెట్స్ నామినేషన్స్ లో ఉండగా.. శనివారం ఎపిసోడ్ లో చంటి, శ్రీ సత్యలను సేఫ్ చేశారు నాగార్జున. ఇక మిగిలిన ఐదుగురు రేవంత్, ఫైమా, అభినయ శ్రీ, ఇనయ, ఆరోహిలలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి. అయితే ఈ వారం క్లాస్, మాస్, ట్రాష్ టాస్క్ ల వల్ల బుధవారం నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. అందుకే సోమవారం నుంచి జరగాల్సిన ఓటింగ్ బుధవారం చేయడం వల్ల ఓటింగ్ కూడా తక్కువైంది.
ఈ క్రమంలో ఈ వారం అసలు ఎలిమినేషన్ లేకుండా చేశాడు బిగ్ బాస్. అది బిగ్ బాస్ కాబట్టి ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. అలా బిగ్ బాస్ సీజన్ 6 మొదటి వారం ఎలిమినేషన్ లేకుండా చేస్తున్నారు. నిజానికి ఇది మంచి డెశిషన్ అని అంటున్నారు ఆడియన్స్. బుధవారం నుంచే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవడం వల్ల తక్కువ ఓట్లు వేసే అవకాశం కలిగింది. అందుకే రాబోయే వారం సోమవారం రోజే ఎట్టి పరిస్థితుల్లో నామినేషన్స్ ఉండేలా చేస్తున్నారు.
BiggBoss 6 లో 21 మంది కంటెస్టంట్స్ హౌజ్ లోకి వచ్చారు. మరి మొదటి వారం ఎలిమినేషన్ లేదంటే రెండో వారం ఇద్దరిని ఎలిమినేట్ చేసినా చేయొచ్చు. ఈ వారం ఎలిమినేషన్ కాకుండా తప్పించుకున్న వారు వచ్చే వారమైనా తమ ఆటతో ఆడియన్స్ ని మెప్పిస్తే బెటర్.