కృష్ణా టీడీపీ లీడ‌ర్లు బోడే – బోండా గెలుపులో ఈ సారి బ్లాస్టింగ్ ట్విస్ట్ ఇదే…!

గత ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలైన నేతల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన బోడే ప్రసాద్, బోండా ఉమాలు ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే వీరు ఖచ్చితంగా గెలుస్తారని టి‌డి‌పి శ్రేణులు కాన్ఫిడెన్స్ గా ఉన్నాయి. వీరు ప్రాతినిధ్యం వహించే సీట్లలో టి‌డి‌పి సైతం బలంగా ఉందని, అందుకే వీరికి ఓటమి దగ్గరకు రాదని అనుకున్నారు. కానీ అనూహ్య రీతిలో ఇద్దరు నేతలు ఓటమి పాలయ్యారు. పెనమలూరులో బోడే, విజయవాడ సెంట్రల్ లో బోండా ఓడిపోయారు.

Lokesh Nara on Twitter: "తెలుగుదేశం పార్టీ పెనమలూరు నియోజకవర్గ ఇంఛార్జ్,  మాజీ శాసనసభ్యులు బోడె ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.  https://t.co/WF7LUlFnp4 ...

అయితే ఇదే నేతలు 2014 ఎన్నికల్లో మంచి మెజారిటీలతో గెలిచారు..బోడే 31 వేల ఓట్ల మెజారిటీతో గెలవగా, బోండా 27 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక ఎమ్మెల్యేలుగా వీరు తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగానే చేశారు. పైగా రెండు స్థానాల్లో టి‌డి‌పికి పట్టు ఉంది..దీంతో 2019 ఎన్నికల్లో కూడా వీరు గెలుస్తారని అంచనాలు ఉన్నాయి. కానీ ఈ అంచనాలు తారుమారు అయ్యాయి. ఇద్దరు నేతలు ఓటమి పాలయ్యారు.

పెనమలూరులో బోడే 11 వేల ఓట్ల తేడాతో ఓడితే… సెంట్రల్ లో బోండా కేవలం 25 ఓట్ల తెద్తఓ ఓడిపోయారు. ఇలా ఇద్దరు నేతలు ఓటమి పాలయ్యారు. కానీ ఇద్దరు నేతలు ఈ నాలుగేళ్లలో అనూహ్యంగా పుంజుకున్నారు. పైగా వీరిపై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. పెనమలూరులో పార్థసారథికి, సెంట్రల్ లో మల్లాది విష్ణుకు యాంటీ బాగానే ఉంది.

Jagan has no right to continue in power any longer: Bonda Uma

దీంతో రెండు చోట్ల టి‌డి‌పికి ఆధిక్యం కనిపిస్తుంది. అదే సమయంలో ఈ రెండు చోట్ల జనసేనకు ఓటింగ్ ఎక్కువగా ఉంది. పెనమలూరులో 20 వేల వరకు ఓటింగ్ ఉంటే..సెంట్రల్ లో 30 వేల ఓటింగ్ వరకు ఉంది. ఇక టి‌డి‌పి-జనసేన కలిస్తే..బోడే, బోండా మళ్ళీ భారీ మెజారిటీలతో గెలవడం ఖాయమని చెప్పవచ్చు.