సౌత్ స్టార్ హీరో రజినీకాంత్ గత కొంతకాలంగా ఎటువంటి సినిమాలు చేసినా కూడా వరుస డిజాస్టర్లు వస్తున్నాయి. ఈసారి ఎలా అయినా నిర్మాతలకు భారీ స్థాయిలో ప్రాఫిట్ అందించాలి అని జైలర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఈ సినిమాకు గత కొన్ని వారాల ముందు వరకు కూడా పెద్దగా పాజిటివ్ టాక్ అయితే లేదు. కానీ మెల్లమెల్లగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండగా హైప్ క్రియేట్ అయింది. ముఖ్యంగా తమన్నా చేసిన నువ్వు కావాలయ్యా సాంగ్ భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది.
దానికి తోడుగా ట్రైలర్ కూడా పాజిటివ్ వెబ్ అయితే క్రియేట్ చేసింది. ఇక మొత్తానికి సినిమా బిజినెస్ కూడా గట్టిగానే జరిగినట్టు తెలుస్తుంది. జైలర్ సినిమా విడుదల ముందు థియేట్రికల్ ఇంకా ఎంత ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిందో అనే విషయానికి వెళితే… ఏరియాల వారిగా చూసుకుంటే ముందుగా తమిళనాడులో ఈ చిత్రానికి దాదాపు రూ.60 కోట్లు రేంజ్ లోని ధర పలికినట్లుగా తెలుస్తుంది. ఇక కర్ణాటక మొత్తంలో చూసుకుంటే రూ.10 కోట్ల వరకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ము డైపోనట్లు సమాచారం.
ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూసుకుంటే రూ.12 కోట్లకు డీల్ క్లోజ్ అయింది. ఇక కేరళలో రూ.5.5 కోట్లు రేంజ్ లో జరిగింది. మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రకారం చూసుకుంటే రూ.3 నుంచి రూ.4 కోట్లు మధ్యలోనే ఈ సినిమా బిజినెస్ చేసిందని టాక్. ఇక ఇండియా మొత్తంలో కూడా జైలర్ చిత్రం దాదాపు రూ.91 కోట్లు రేంజ్ లో బిజినెస్ చేసినట్లు సమాచారం. ఓవర్సీస్‌లో చూసుకుంటే రూ.32 కోట్ల ధర పలికినట్లు తెలుస్తుంది.
ఇక వరల్డ్ వైడ్ గా జైలర్ చిత్రం థియేటర్ ఫ్రీ రిలీజ్ రూ.123 కోట్లు సెట్ అయింది. అంటే సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం రూ.124 కోట్లు అయినా అందుకోవాలి. దాదాపు రూ.250 కోట్లు రేంజ్ లో అయితే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవసరం ఉంది. కానీ ఈ సినిమా గురించి చూసుకుంటే మాత్రం ఈ చిత్రానికి పెట్టిన బడ్జెట్ కూడా అందించలేదేమోనని టాక్ వినిపిస్తుంది. 2011 తర్వాత రజనీకాంత్ ప్రతి సినిమా కూడా ఎంతో కొంత నష్టం కలిగిస్తూనే ఉంది. మరి ఈసారి జైలర్ సినిమా నష్టాలు మిగిలిస్తుందో సక్సెస్ ని తెస్తుందో చూడాలి.