డోస్ పెంచిన మెగా డాటర్..!

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక మూడు సినిమాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. తనకు అచ్చొచ్చిన వెబ్ సీరెస్ లనే నమ్ముకున్న నిహారిక లేటెస్ట్ గా తన హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. ఇన్నాళ్లు తనలోని గ్లామర్ దాచి పెట్టిన ఈ అమ్మడు లేటెస్ట్ పిక్స్ తో షాక్ ఇచ్చింది. తనలో ఈ యాంగిల్ కూడా ఉందని చెప్పకనే చెబుతున్న ఈ బ్యూటీ గ్లామర్ రోల్స్ కు కూడా తాను సై అన్నట్టుగా హింట్ ఇస్తుంది.

ముంబై వెళ్లి మరి అమ్మడు ఈ ఫోటో షూట్ చేయించుకుంది అంటే దీని వెనుక ఏదో పెద్ద ప్లానే ఉన్నట్టు తెలుస్తుంది. ఉన్నట్టుగా మెగా డాటర్ ఈ డోస్ పెంచే ప్రోగ్రాం ఎందుకు పెట్టుకుందో అని అర్ధం కాని మెగా ఫ్యాన్స్ కన్ ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. ఫ్లాపులొచ్చినా మెగా డాటర్ కాబట్టి ఆఫర్స్ వస్తున్నా సరే నిహారికనే కావాలని వాటిని వద్దని అంటుందట.

లేటెస్ట్ గా నిహారిక షేర్ చేసిన పిక్స్ చూస్తుంటే తన తర్వాత సినిమాలో గ్లామర్ షోకి తను సై అన్నట్టుగా చెప్పినట్టే అంటున్నారు. ఏది ఏమైనా మెగా డాటర్ ఈ హాట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ పిక్స్ వల్ల నిహారిక క్రేజ్ పెరుగుతుందని చెప్పొచ్చు.

Tags: Daughter, Hot Pics, Konedala Niharika, NagaBabu, Tollywood