భగవంతుడి ప్రసాదం ఎందుకు తినాలి… ప్ర‌సాదం దానం చేస్తే ఎంత మేలో తెలుసా..!

హిందూ సాంప్రదాయంలో దేవతలకు నైవేద్యం సమర్పించే ప్రసాదం రూపంలో స్వీకరించే సాంప్రదాయం ఎప్పటినుండో ఉంది. భగవంతుని ప్రసాదం స్వీకరించడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకే చాలామంది దానిని ఆహారంగా భావిస్తూ ఉంటారు. గుడికి వెళ్ళినప్పుడు లేదా ఇంటిలో ఏదైనా శుభకార్యం జరుపుకున్నప్పుడు ప్రసాదం ఇస్తారు.

ప్రసాదం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. భగవంతుడు ప్రసాదం తీసుకోవడం వల్ల మనసు స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటుంది. సాధారణంగా ఇతర ఆహారాలతో పోలిస్తే ప్రసాదం చాలా తక్కువగా తింటూ ఉంటారు. కానీ అదే ప్రసాదం మనసుకి రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. భగవంతుడికి సమర్పించే నైవేద్యం ప్రసాదంగా స్వీకరించడం వల్ల భగవంతుడితో ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుంది. ప్రసాదం తినడం వల్ల మన మనసులో భగవంతుడు పట్ల భక్తి, విశ్వాసాన్ని కలిగిస్తుంది.

ప్రసాదాలు రకాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. పంచామృత, శరణామృత, బెల్లం, మినుము, కొబ్బరి, తులసి నీరు ఇలా అనేక ప్రసాదాలను ఇస్తూ ఉంటారు. ప్రసాదం మీరు అందజేసినట్లయితే ఇతరులు మనసులో మీ స్థానం నిలిచిపోతుంది. అలాగే భగవంతుడి పట్ల మీకు భ‌క్తి కూడా ఉంటుంది. అలాగే మనసు స్థితి, దిశ మారుతుంది. భగవద్గీత ప్రకారం భగవంతునికి నైవేద్యాన్ని పెట్టినట్లయితే అనంతరం ఇతరులకు దానం చేయడం ద్వారా మనకు స్వర్గంలో నివాసం లభిస్తుందట.