సాధారణంగా గేదెలు, ఆవులు నుంచి పాలు తీయడం మనందరం చూసే ఉంటాం. వైద్యం కోసం గాడిద, మేక పాలు తీస్తారని మనందరికీ తెలిసిందే. అయితే కుక్క పాలను తీసేందుకు ప్రయత్నించారు ఓ ఇద్దరు చిన్నారులు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటారు. కానీ దాంట్లో కొన్ని వీడియోలు మాత్రమే వైరల్ అవుతాయి. అలాగే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇద్దరు బుడ్డోళ్ళు కుక్క పాలు తీయడానికి ట్రై చేస్తున్నారు. దీనికి సంబంధించిన విజ్యువల్స్ ని కూడా చూడవచ్చు. Follow___v అనే ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి పోస్ట్ అయినా ఈ వీడియోలో ఇద్దరు బుడ్డోళ్ళు తమ ముందున్న కుక్క నుంచి పాలు తీసే ప్రయత్నం చేశాడు.
అందుకోసం వారిద్దరూ ఓ పెద్ద బకెట్ ని తీసుకుని వెళ్లడం ఆశ్చర్యం. అయితే ఆ ఇద్దరూ బుడ్డోళ్ళు పాలు తీసే ప్రయత్నం చేయగానే కుక్క వారి దగ్గర నుంచి పారిపోయింది. తాము పాలు తీస్తుంటే ఆ కుక్క వెళ్ళిపోవడం వల్ల ఓ బుడ్డోడు ఏడుపు మొఖం పెట్టేసాడు.
View this post on Instagram