ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాజధాని ఏర్పాటు చుట్టూనే తిరిగుతున్నాయి. రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. తాజాగా ఆర్టికల్ 254 అంశం తెరమీదకు వచ్చింది. దానిని ఉపయోగించి సీఎం జగన్ నిర్ణయాలకు బ్రేక్ వేయవచ్చని వాదనలు మొదలయ్యాయి. ఇంతకీ విషయమేమిటంటే.. రాజధాని ఏర్పాటు అంశం రాష్ర్ట పరిధిలోనిదేనని, దీనిని ఎవరు ఏమీ చెప్పినా నమ్మవద్దని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పష్టం చేసింది. ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానాన్ని ఇచ్చింది. ఇంతకు ముందు కూడా బీజేపీ ఎంపీ, ఏపీ నాయకుడు జీవీఎల్ నర్సింహరావు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.. తాజాగా కేంద్రం తీరుపై మాజీ మంత్రి వడ్డే శోభానాద్రిశ్వర్ స్పందించారు. బీజేపీపై ఫైర్ అయ్యారు. కొత్తగా 254 ఆర్టికల్ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు.
ఆయన ఏమంటున్నాడంటే రాష్ర్ట ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవచ్చని ఆయన వివరించారు. అందుకు ఆర్టికల్ 254ను వినియోగించుకోవచ్చని వివరించారు. ఇటీవలే సీఏఏను వ్యతిరేకిస్తూ కేరళ రాష్ర్ట ప్రభుత్వం తీర్మానం చేయగా, దానిని అక్కడి గవర్నల్ 254 ఆర్టికల్‌ను ఉపయోగించి తప్ప బట్టారని ఉదహరించారు. ఆ ప్రకారం చేయవచ్చని స్పష్టం చేశారు. రాజ్యాంగంపై కనీస పరిపక్వత లేకుండా ఎంపీ నర్సింహరావు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇదే విషయాన్ని ఆయన వాట్సప్‌కు పంపి అడుగుతానని మాజీ మంత్రి వెల్లడించడం గమనార్హం. అదీగాక ఈసారి విజయవాడకు వస్తే ఈ అంశంపై తనకు బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ఆయన సవాల్ విసిరారు. మరి ఎంపీ గారు అందుకు సిద్ధమవుతారా? తోక ముడుస్తారా? అన్నది చూడాలి మరి.