చింత‌ల‌పూడి టీడీపీ టిక్కెట్ అనిల్‌కు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు… త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌..?

గత రెండు మూడు సంవత్సరాలుగా ఇన్చార్జి లేకుండా తీవ్ర ఉత్కంఠ రేపుతూ వస్తున్న ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సి రిజర్వ్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో చంద్రబాబు దాదాపు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ యువ నేత, ఎన్నారై బొమ్మాజీ అనిల్ కు అభ్య‌ర్థిత్వం ఇవ్వాలని ఖరారు చేశారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. అనిల్ కు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. అనిల్ తండ్రి బి దానం గతంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేశారు.

అనిల్ సోదరుడు బీఎన్‌. విజయ్ కుమార్ బాపట్ల జిల్లా సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుత టిడిపి ఇన్చార్జ్ కావటం విశేషం. ఇటు రాజకీయ నేపథ్యం, ఆర్థిక.. అంగ బలాలతో పాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సామాజిక సమీకరణ బ్యాలెన్స్ చేయడంతో పాటు అనిల్ ప్రొఫైల్ నేపథ్యంలో ఆయనకే సీటు ఇవ్వాలని ఫిక్స్ చేశారు. అనిల్ గత 7 – 8 నెలలుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ రెండు క్యాంప్ ఆఫీసులు కూడా ఓపెన్ చేశారు. తాజాగా నియోజకవర్గంలో లోకేష్ నిర్వహించిన యువగళం యాత్రను సక్సెస్ చేయటానికి అందరూ కష్టపడ్డారు.

అయితే ఆర్థిక బలాల విషయంలో అనిల్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. వలసప‌ల్లి అడ్డరోడ్డు నుంచి ధర్మాజీ గూడెం, చింతలపూడి ప్రోగ్రామ్‌లు సూప‌ర్ స‌క్సెస్ చేయ‌డంతో పాటు జంగారెడ్డిగూడెం బహిరంగ సభ నిర్వ‌హ‌ణ విషయంలో అనిల్ ఎక్కడా రాజీ పడలేదు. ప్రకటనలు, ప్లెక్సీలు, బాణ‌సంచా, కార్యకర్తలకు భోజన ఇతర సదుపాయాల విషయంలో అనిల్ లక్షలాది రూపాయలు మంచినీళ్ల‌లా ఖర్చు చేశారు. ఇక ఎన్నికల కోసం ఖ‌ర్చంతా పూర్తిగా తానే భరిస్తానని క్లారిటీ ఇచ్చేశారు.

మామూలుగా రిజర్వ్ నియోజకవర్గం టిక్కెట్ ఆశావాహులు చాలా వరకు పార్టీ కార్యకర్తల మీద ఆర్థిక భారం మోపుతూ ఉంటారు అయితే అనిల్ రంగంలోకి దిగినప్పటి నుంచి అందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు. పార్టీ కార్యక్రమాల విషయంలో ఖర్చు కొంత‌ ఎక్కువగా తానే భరిస్తూ వస్తున్నారు. ఇటు ఏలూరు జిల్లా పార్టీ నాయ‌కులు, నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కుల‌ను సమ‌న్వ‌యం చేసుకోవ‌డంతో పాటు అటు ప్ర‌కాశం జిల్లా పార్టీ నేత‌ల ద్వారా… చంద్ర‌బాబు స‌న్నిహితుడు అయిన నిర్మాత‌, వైజయంతీ మూవీస్ అధినేత చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ ద్వారా ఇలా ర‌క‌ర‌కాల కోణాల్లో ప్ర‌య‌త్నాల ద్వారా పార్టీ అధినేత‌కు త‌న‌పై పూర్తి భ‌రోసా క‌లిగేలా చేశారు.

ఇక వివాద ర‌హితుడు, సౌమ్య‌డు కావ‌డంతో క్యారెక్ట‌ర్ ప‌రంగా కూడా అనిల్‌కు ప్ల‌స్ కానుంది. ఇక ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో గోపాల‌పురం, కొవ్వూరు సీట్లు ఎస్సీ – మాదిక సామాజిక వ‌ర్గానికే ఖ‌రారు కానున్నాయి. ఈ క్ర‌మంలోనే అనిల్ మాల సామాజిక వ‌ర్గం కావ‌డంతో ఆర్థిక‌, అంగ‌, వ్య‌క్తిగ‌త ఇమేజ్ ఇవ‌న్నీ అనిల్‌కు అభ్య‌ర్థిత్వం ద‌క్కే విష‌యంలో చాలా ప్ల‌స్ అయ్యాయే చెప్పాలి. ఇక త్వ‌ర‌లోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.