Vikram కోబ్రా 20 నిమిషాలు లేపేశారు.. జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఇప్పుడు ఎందుకు బాసు..!

చియాన్ విక్రం హీరోగా అజయ్ జ్ఞానముత్తు డైరక్షన్ లో సెవెన్ స్క్రీన్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమా కోబ్రా (Vikram). లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించారు. సినిమాలో హీరోయిన్స్ గా కె.జి.ఎఫ్ భామ శ్రీనిధి శెట్టి, మృణాలిని రవి నటించారు. ఆగష్టు 31న రిలీజైన ఈ సినిమా లెంగ్త్ ఎక్కువ అయ్యిందనే కామెంట్స్ బాగా వినిపించాయి. ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద కూడా పడ్డది. అయితే సినిమా రిలీజైన ఒక్కరోజుకే నష్టం తెలుసుకున్న మేకర్స్ కోబ్రా సినిమా నుంచి 20 నిమిషాలు ట్రిం చేశారట.

సెప్టెంబర్ 1 సాయంత్రం ఆట నుంచి ఈ ట్రిం చేసిన వర్షన్ అందుబాటులో ఉంచుతున్నారని మేకర్స్ ఎనౌన్స్ చేశారు. అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సినిమా లెంగ్త్ ఎక్కువ ఉండటం సినిమా అనుకున్న రేంజ్ లేకపోవడంతో డివైడ్ టాక్ వచ్చేసింది. ఇక ఇప్పుడు ఎంత ట్రిం చేసినా సరే సినిమాని కాపాడటం కష్టం.

తమిళంలో విక్రం స్టార్ హీరో కాబట్టి అక్కడ సినిమా బాగానే రన్ అవుతుంది కానీ తెలుగులో మాత్రం కోబ్రా (Vikram) నిరాశపరచింది. తెలుగులో విక్రం ఎంత ప్రమోషన్స్ చేసినా సరే కోబ్రా ఇక్కడ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని పొందలేదు. లెంగ్త్ విషయంలో ఆల్రెడీ తెలుగు ఆడియెన్స్ సినిమాని లైట్ తీసుకున్నారు.

 

Tags: Ajay Gnanamutthu, Chiyan Vikram, Cobra, Cobra Movie Talk, Cobra movie Trim, Kollywood, vikram, Vikram Cobra