Aamir Khan : లాల్ సింగ్ చడ్డా.. విజయ్ సేతుపతి మంచి నిర్ణయం..!

ఆమీర్ ఖాన్ (Aamir Khan ) హీరోగా అద్వైత్ చందన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా లాల్ సింగ్ చడ్డా.. ఈ సినిమాని హిందీతో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ చేశారు. అంతకుముందు ఆమీర్ ఖాన్ సినిమాలకు తెలుగులో మంచి బజ్ ఉండేది. కానీ ఎందుకో లాల్ సింగ్ చడ్డా సినిమా ఆ బజ్ ని క్రియేట్ చేయలేకపోయింది. సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసినా సరే లాభం లేకుండాపోయింది. సినిమాలో అక్కినేని హీరో నాగ చైతన్య కూడా నటించాడు. అయినా సరే సినిమా పెద్దగా వర్క్ అవుట్ అవలేదు.

గురువారం రిలీజైన ఈ సినిమా ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో బాలరాజు పాత్రలో నాగ చైతన్య పర్వాలేదు అనిపించాడు. అయితే ఈ పాత్రలో మొదట నాగ చైతన్యని అనుకోలేదట. కోలీవుడ్ హీరో కం విలన్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని అనుకున్నారట. ఆమీర్ ఖాన్ సినిమాలో ఆఫర్ వస్తే ఎవరైనా కాదంటారా చెప్పండి. విజయ్ సేతుపతి కూడా లాల్ సింగ్ చడ్డా సినిమా చేయాలనే అనుకున్నారట. కానీ ఆ టైం లో ఉప్పెన, సిరా నరసిం హా రెడ్డి సినిమాలు చేస్తుండటం తో ఆ సినిమా చేయడం కుదరలేదట.

అంతేకాదు ఆమీర్ ఖాన్ (Aamir Khan ) సినిమా అంటే వర్క్ షాప్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే విజయ్ సేతుపతి ఆ మూవీని వదులుకున్నాడట. మొత్తానికి విజయ్ వదులుకున్న సినిమా నిరాశపరచడంతో ఆ సినిమా చేయకుండా ఉండటం మంచిదైందని చెప్పొచ్చు.

Tags: Aamir Khan, Bollywood, Lal Singh Chadda, Naga Chaitanya, Vijay Setupathi