నిత్యామీనన్ ను రిజెక్ట్ చేస్తావా.. నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా..యూట్యూబర్ పై ఫ్యాన్స్ ఫైర్ ..!

ప్రేమ పేరుతో తనను ఒక వ్యక్తి వేధిస్తున్నాడని ఇటీవల స్టార్ హీరోయిన్ నిత్య మీనన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అతడి పేరు సంతోష్ వర్కీ అని, అతడొక యూట్యూబర్ అని నిత్య తెలిపింది. సంతోష్ తనను ప్రేమ పేరుతో గత ఆరేళ్లుగా వేధిస్తున్నాడని, 30కిపైగా నెంబర్ల నుంచి ఫోన్ చేస్తూ విసిగించే వాడని, అతడి వేధింపులు భరించలేకపోయాను..అని నిత్యామీనన్ తెలిపింది. నిత్యా మీనన్ యూట్యూబర్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ కాగా.. తాజాగా నిత్యామీనన్ ను వేధించినట్లు చెబుతున్న సంతోష్ స్పందించాడు.

అవును నేను గతంలో నిత్యామీనన్ ను ప్రేమించాను. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు చచ్చినా ఆమెను పెళ్లి చేసుకోను. ఆమెకు సంబంధించిన వివరాలు నాకు ముందే తెలిసి ఉంటే అసలు ప్రేమించే వాడిని కాదు. నిత్యామీనన్ కు ఇప్పటికే ఒక వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని వాళ్ళ తల్లి చెప్పింది. అలా తండ్రి మాత్రం నిశ్చితార్థం జరగలేదని చెబుతున్నాడు.30 నంబర్ల నుంచి నిత్యామీనన్ కు ఫోన్ చేసి వేధించినట్లు ఆమె చేస్తున్న ఆరోపణలు నిజం కాదు. అసలు ఒక వ్యక్తికి 30 నంబర్లు ఇస్తారా.. అని ప్రశ్నించాడు.

నిత్య మీనన్ కుటుంబం నాపై లైంగిక వేధింపుల కేసు పెట్టాలని చూస్తోంది’ అని సంతోష్ కామెంట్స్ చేశాడు. అయితే సంతోష్ నిత్యా మీనన్ పై ఆరోపణలు చేసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా నిత్యామీనన్ ఫ్యాన్స్ చెలరేగిపోతున్నారు. ఒకసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకోవాలని, నీ మొఖానికి నిత్య మీనన్ కావాలా అని సంతోష్ ని కడిగేస్తున్నారు. అసలు ఆమెను పెళ్లి చేసుకోవడానికి నీకేం అర్హత ఉందని ప్రశ్నిస్తున్నారు. ఓవరాక్షన్ చేయడం ఆపాలని, నువ్వు నిత్యను రిజెక్ట్ చేయడం ఏమిటంటూ తిట్ల దండకం అందుకున్నారు.

Tags: nithya menon, santhosh varkey, telugu news, tollywood news